iDreamPost

మాచర్లకు రాను రానంటున్న వెంకన్న

మాచర్లకు రాను రానంటున్న వెంకన్న

మాచర్ల ఘటన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను పీడకలలా వెంటాడుతోంది. మాచర్ల పేరు వింటేనే వణికిపోతున్నారు. ఈ నెల 10వ తేదీన మాచర్లలో స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణ కోసమంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు వెళ్లారు. అక్కడ జరిగిన ఘర్షణలో కారు అద్దాలు పగిలిపోగా పోలీసుల సహాయంతో వీరు బయటపడ్డారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దాడి చేసిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. బుద్ధా వెంకన్న, బొండా ఉమాల వాంగ్మూలం కోసం పోలీసులు వారికి నోటీసులు జారీ చేశారు. మాచర్ల వచ్చి వాగ్మూలం ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

పోలీసులు వాంగ్మూలం కోసం పిలుస్తుండగా.. బుద్ధా వెంకన్న మాత్రం తమను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్య చేయించేందుకే వారి ద్వారా పిలిపిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. తమకు ప్రాణహాని ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఆంధ్ర పోలీసులు మీద నమ్మకంలేదంటున్నారు. పిన్నెళ్లిని అరెస్ట్‌ చేసి పోలీసులు నిజాయతీని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే తాము హైకోర్టుకు వెళ్లి ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని కోరతామంటున్నారు. ఘటన జరిగిన తర్వాత నుంచి డీజీపీ తమ ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారని, తాము ఎవరితో.. ఏమి మాట్లాడుతున్నామో తెలుసుకుంటూ తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారని వెంకన్న వాపోతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి