iDreamPost

జైళ్లలో ఖైదీలు చేసే పనికి డబ్బు ఎలా వస్తుంది? ఇంత తక్కువ దేనికి ఇస్తారు?

Prisoners Earn Money: దేశంలో ఎలాంటి నేరాలు చేసిన పోలీసుల నుంచి తప్పించుకోలేరు. నేరం చేసిన నింధితులకు కోర్టు జైలు శిక్ష విధిస్తుంది.

Prisoners Earn Money: దేశంలో ఎలాంటి నేరాలు చేసిన పోలీసుల నుంచి తప్పించుకోలేరు. నేరం చేసిన నింధితులకు కోర్టు జైలు శిక్ష విధిస్తుంది.

జైళ్లలో ఖైదీలు చేసే పనికి డబ్బు ఎలా వస్తుంది? ఇంత తక్కువ దేనికి ఇస్తారు?

సాధారణంగా నేరాలకు పాల్పపడిన వారికి కోర్టు శిక్ష విధిస్తుంది. శిక్ష అనంతరం వారిని జైలుకు తరలిస్తారు. జైలు లేదా కారాగారం అంటే నేరం చేసి శిక్షను అనుభవించువారిని ఉంచు నిర్భంధగృహం. ఇది పోలీస్ స్టేషన్ కి అనుసంధానంగా ఉంటాయి. నేరస్థుల్లో సత్ప్రవర్తన తీసుకురావడానికి కొంతకాలం పాటు జైలులో ఉంచుతారు. భారీ నేరాలకు పాల్పపడి వారిని సంవత్సరాల పాటు జైల్లో ఉంచుతారు. మరి సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపే వారి జీవితాలు ఎలా ఉంటాయి.. ఖైదీలు జైళ్లలో పని చేస్తే ఎంత డబ్బు వస్తుంది, దాన్ని ఎలా ఖర్చుపెడతారు. అన్ని విషయాల గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

ఏ నేరం చేసినా చివరికి శిక్ష అనుభవించాల్సిందే అంటారు. నేరాలు, ఘోరాలకు పాల్పపడిన వారికి కోర్టు శిక్ష విధిస్తుంది. వారు చేసిన నేరాలను బట్టి జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అయితే జైలు శిక్ష పడిన వారు ఊరికే కూర్చొని తినడానికి వీలు ఉండదు.. వారందరూ పని చేయాల్సిందే. ఖైదీల సామర్ధ్యం, నైపుణ్యతను బట్టి వారు చేసే పనులు మారుతుంటాయి. ఆ పనికి తగ్గ ప్రతిఫలం వారు పొందుతారు. కొన్ని జైళ్లలో ఖైదీలు తమ పనిని బట్టి ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంటారు. ఖైదీల కోసం బ్యాంక్ లో ఖాతాలు తెరిచి వారి సొమ్ము అందులో జమ చేస్తుంటారు. జైళులో కరెన్సీ బదులు మనీ కూపన్లు ఇస్తుంటారు. ఈ కూపన్లు వేర్వేరు ధరలను కలిగి ఉంటాయి. ఖైదీలు తమ పనికి బదులుగా వీటిని పొందుతుంటారు. ఒకవేళ పని చేయలని వారి, అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి వారి బంధులు డబ్బును డిపాజిట్ చేయవొచ్చు.. వాటిని కూపన్లుగా మార్చి అందజేస్తారు. ఖైదీలు జైలులో డబ్బు సంపాదిస్తే.. వారు ఆ డబ్బును తమ ఇంటికి పంపించే సదుపాయం ఉంది. ఖైదీలు డబ్బు అలాగే ఉంచుకుంటే విడుదలైనపుడు ఆ మొత్తం వారికి చెల్లిస్తారు. ప్రతి జైలులో ప్రభుత్వ క్యాంటిన్ తో పాటు నిత్యావసరాలు అందుబాటులో ఉంటాయి.ఇక్కడ సబ్బులు, టూత్ పేస్టులు, ఇన్నర్ వేర్ వంటివి కొనుగోలు చేసుకోవొచ్చు. జైళ్లలో ఉండే ఖైదీలకు వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి వృత్తి శిక్షణ, వ్యవసాయం, ఉద్యాన కార్యకలాపాలు, యోగ, కంప్యూటర్ శిక్షణ, ఎలక్ట్రీషియన్ ఇలా ఎన్నో విభాగాల్లో శిక్షణ ఇస్తారు. అందుల వారు నిష్ణాతులైతే వారికి తగిన జీతం అందజేస్తారు.

How do prisoners get paid for their work in prisons

జైళ్లలో ఖైదీలకు జీతం ఎలా ఇస్తారు:

నేరం చేసి జైళు శిక్ష అనుభవించే వారికి కొంతకాలం పాటు పలు విభాగాల్లో శిక్షణ ఇస్తారు. అలా శిక్షణ పొందిన ఖైదీలు పనులు చేసినందుకు జీతం పొందుతారు. అది స్వచ్ఛందంగా లేదా శిక్షలో భాగంగా ఉండవొచ్చు. ఈ వేతనం వారి నైపుణ్యాన్ని బట్టి ఇస్తారు.

ఖైదీలు చేసే పనులకు ఎంత ఇస్తారు:

ఖైదీలకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా కూలీ చెల్లిస్తుంటారు. 2017 లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిలీజ్ చేసిన 2015 జైలు డేటా ప్రకారం.. పుద్దుచ్చేరిలో మంచి నైపుణ్యం కలిగిన ఖైదీలు, సెమీ స్కిల్డ్ నేరస్థులు, నైపుణ్యం లేని దోషులకు రూ.180, రూ.160, రూ.150 చొప్పున వేతనాలు నిర్ణయించారు. ఇక ఢిల్లీకి చెందిన తిహారు వరుసగా రూ.171,రూ.138, రూ.107 ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత స్థానం బీహార్ రూ.156,రూన112, రూ.103, రాజస్థాన్ లో రూ.150,రూ.130 గా వేతనం చెల్లిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక తక్కువ వేతనం చెల్లించే రాష్ట్రాలు మిజోరాం, మణిపూర్ ఇక్కడ రోజు కూలీ రూ.12 నుంచి రూ.15 వరకు చెల్లిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ లో రూ.35, రూ.30, రూ.26 చెల్లిస్తున్నాయి, ఛత్తీస్ గఢ్ రూ.30, రూ.26 చెల్లిస్తున్నాయి. మధ్య ప్రదేశ్ లో రూ.55, రూ.50 చెల్లిస్తున్నాయి. గతంలో సూరత్ జైలులో ఖైదీల కోసం డైమండ్ ప్రాసెస్ యూనిట్ ప్రారంభించారు. ఇందులో పని చేస్తున్న ఉద్యోగులకు తమ నైపుణ్యాన్ని బట్టి వేతనం ఇస్తున్నారు. ప్రతి ఖైదీ ఇక్కడ రూ.20 వేల వరకు సంపాదిస్తున్నారు.

జైళ్లలో పని చేయాల్సిందేనా?

భారత దేశంలో నేరం చేసిన వారికి కఠిన శిక్షలు విధుస్తుంటారు. శిక్ష పొందిన ఖైదీలు వర్క్ షాప్, పరిశ్రమల తప్పనిసరిగా పనిచేయాల్సి ఉంటుంది. జైలు పరిశ్రమ 1894 జైలు చట్టం, జైలు మాన్యువల్ ద్వారా నిర్వహించబడుతుంది.. ఇది జైళ్ల నిర్వహణకు సంబంధించిన నియమాలు, నిబంధనలను వివరిస్తుంది. ఇక్కడ పలు రకాల పనులు అంటే తాపీ పని, ప్లంబిగ్, టైలరింగ్, రెడిమేడ్ వస్త్ర తయారీ, తోలు పని, జైలు సేవ, వ్యవసాయం, ఉద్యానవనం, పౌల్ట్రీ , పూల పెంపకం ఇలా ఉన్నో రకాల పనులు ఖైదీలచే చేయిస్తుంటారు. దానికి తగ్గ ప్రతిఫలం ఇస్తుంటారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి