iDreamPost

కారు నడుపుతూ కునుకు.. రోడ్డు ప్రమాదంలో మోడల్ మృతి!

  • Author ajaykrishna Published - 01:08 PM, Fri - 4 August 23
  • Author ajaykrishna Published - 01:08 PM, Fri - 4 August 23
కారు నడుపుతూ కునుకు.. రోడ్డు ప్రమాదంలో మోడల్ మృతి!

ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ఇప్పటికే వరుస మరణవార్తలతో అభిమానులు కలవరపడుతున్నారు. తాజాగా ప్రముఖ మోడల్, మిస్ వెనీజుల అరియానా వేర రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన ఘటన ఇండస్ట్రీని షాక్ కి గురిచేసింది. గత నెలలో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అరియానాని.. వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేశారు. చికిత్స పొందుతున్న సమయంలో ఆమెకు హార్ట్ ఎటాక్ రావడంతో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఆ తర్వాత అరియానా గురించి ఆమె తల్లి వివియన్‌ ఓచోవా స్పందించి.. అరియానా కారు డ్రైవ్ చేసే సమయంలో అలసటకు గురై కునుకు తీసిందని.. తాను అలా రెప్ప వాల్చడంతో ప్రమాదానికి గురైందని మీడియాకు తెలిపింది.

ఇక అరియానా మోడల్ గా చాలా పాపులర్. కానీ.. ఇలా చిన్న వయసులోనే కన్నుమూయడం అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రస్తుతం అరియానా వయసు 26 ఏళ్లు మాత్రమే. అంతలోనే ఇలా జరగడం చాలా బాధాకరం. బతికి ఉన్నప్పుడు ఎంతోమందికి సాయం చేసిన తన కూతురుని.. దేవుడు ఇంత త్వరగా తీసుకెళ్లి పోతాడని అనుకోలేదంటూ ఆమె తల్లి వివియన్ విషాదంలో మునిగిపోయింది. ఇదిలా ఉండగా.. అరియానా.. మే నెలలో తన అంత్యక్రియల వీడియో పోస్ట్ చేసి షాకిచ్చింది. ‘నా వీడియోలను నేనే తీసుకుంటా. నేను పోయాక నా అంత్యక్రియలను ఎవరైనా వీడియో తీస్తారో లేదో? అందుకే ఎప్పుడో జరగాల్సిన నా అంత్యక్రియలను ఓసారి రికార్డు చేసుకుంటా’ అని ఆ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. అంతేగాక.. ఫుల్‌ హౌస్‌ క్లీనింగ్‌ సర్వీస్‌ అనే కంపెనీని నడుపుతున్న అరియానా.. అక్టోబర్‌ లో జరగనున్న ‘మిస్‌ లాటిన్‌ అమెరికా ఆఫ్‌ ది వరల్డ్‌ 2023’ పోటీల్లో వెనిజులా తరుపున ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. ఇంతలో ఇలా జరగడం బాధాకరం అని ఫ్యాన్స్, నెటిజన్స్ సోషల్ మీడియాలో సంతాపం తెలియజేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ariana Valentina (@arianaviera__)

 

View this post on Instagram

 

A post shared by Ariana Valentina (@arianaviera__)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి