iDreamPost

మళ్లీ వాయిదా పడిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ.. కారణం?

  • Author singhj Published - 03:57 PM, Sat - 29 July 23
  • Author singhj Published - 03:57 PM, Sat - 29 July 23
మళ్లీ వాయిదా పడిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ.. కారణం?

నవీన్ పొలిశెట్టి.. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్​ను తన వైపునకు తిప్పుకున్న నటుడు. సినిమాల్లో వచ్చేందుకు ఎంతో కష్టపడిన నవీన్.. స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీసిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో చిన్న రోల్​తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘డీ ఫర్ దోపిడీ’, ‘వన్: నేనొక్కడినే’ లాంటి మూవీస్​లో యాక్ట్ చేసినా అంతగా పేరు సంపాదించలేదు. అయితే ఆయన నటించిన ‘ఏఐబీ హానెస్ట్ వెడ్డింగ్’, ‘వాట్ ఈజ్ యువర్ స్టేటస్’ లాంటి టెలివిజన్ షోలు యూట్యూబ్​లో ఫుల్ పాపులర్ అయ్యాయి. దీంతో వచ్చిన ఫేమ్​తో ఎట్టకేలకు హీరోగా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ దక్కించుకున్నారు నవీన్.

2019 సంవత్సరం నవీన్ పొలిశెట్టి లైఫ్​ను పూర్తిగా మార్చేసింది. ఆ ఏడాది ఆయన యాక్ట్ చేసిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో పాటు ‘చిచ్చోరే’ చిత్రాలు విడుదల అయ్యాయి. ఆ రెండూ సూపర్ హిట్ అవ్వడంతో ఇటు తెలుగుతో పాటు అటు హిందీలోనూ ఓవర్​నైట్ స్టార్ అయిపోయారు నవీన్. ఆ తర్వాత నటించిన ‘జాతిరత్నాలు’ సినిమాతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని స్థానం సంపాదించారాయన. జోగిపేట్ శ్రీకాంత్​గా పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్​తో థియేటర్లలో ఆడియెన్స్​ను కడుపుబ్బా నవ్వించారు నవీన్. అనంతరం కాస్త గ్యాప్ తీసుకున్న ఆయన ఏకంగా స్టార్ హీరోయిన్ అనుష్కతో నటించే ఛాన్స్​ను దక్కించుకున్నారు.

నవీన్-అనుష్క కాంబోలో తెరకెక్కుతున్న మూవీనే ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. కానీ పలు కారణాల వల్ల ఈ ఫిల్మ్ విడుదల ఆలస్యమవుతూ వస్తోంది. మూవీపై పెద్ద బజ్ కూడా ఏర్పడలేదు. టీజర్​ వచ్చేంత వరకు ఈ సినిమా ఉందనే విషయం మూవీ గోయర్స్​కు కూడా తెలీదు. టీజర్ కూడా ఆహో ఓహో అనేంత రేంజ్​లో లేదు. దీంతో ఇన్ని అడ్డంకుల మధ్య చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. పోస్ట్​ ప్రొడక్షన్ వర్క్ పూర్తవకపోవడమే రిలీజ్​ వాయిదాకు కారణమని ప్రకటనలో తెలిపారు. ‘మిస్​ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ని ముందుగా ఆగస్టు 4న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు పోస్ట్​పోన్ చేస్తున్నట్లు ఒక నోట్​ను పోస్ట్ చేశారు. ఈ సినిమాలో నవీన్ స్టాండప్ కమెడియన్ పాత్రలో కనిపించగా.. అనుష్క చెఫ్​ పాత్రను పోషించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి