iDreamPost

అర సున్న- అర సున్న కూర్చుని గుండు సున్నా కోసం దిశానిర్దేశం: రోజా

దసరా సందర్భంగా మంత్రి రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్- లోకేశ్ భేటీ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే నారా భువనేశ్వరి ఎలాగైతే నిజం గెలవాలి అని కోరుకుంటున్నారో.. తాము కూడా అలాగే నిజం గెలవాలని కోరుకుంటున్నాం అంటూ స్పష్టం చేశారు.

దసరా సందర్భంగా మంత్రి రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్- లోకేశ్ భేటీ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే నారా భువనేశ్వరి ఎలాగైతే నిజం గెలవాలి అని కోరుకుంటున్నారో.. తాము కూడా అలాగే నిజం గెలవాలని కోరుకుంటున్నాం అంటూ స్పష్టం చేశారు.

అర సున్న- అర సున్న కూర్చుని గుండు సున్నా కోసం దిశానిర్దేశం: రోజా

సోమవారం జనసేన- టీడీపీ సమన్వయ కమిటీ భేటీ జరిగిన విషయం తెలిసిందే. ఈ భేటీపై మంత్రి రోజా స్పందించారు. మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా.. అనంతరం మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్- లోకేశ్ భేటీపై మంత్రి రోజా సైటైర్లు వేశారు. అర సున్నా- అర సున్నా కూర్చుని లోపల ఉన్న గుండు సున్నా గురించి దిశా నిర్దేశం చేశారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు కేసుల విషయంలో తాము కూడా నిజం గెలవాలని కోరుకుంటున్నట్లు మంత్రి రోజా వ్యాఖ్యానించారు. అందుకే నారా భువనేశ్వరి సీబీఐ ఎంక్వైరీ కోరితే నిజం అదే బయటకు వస్తుందన్నారు.

“అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలి. సీఎం జగన్ కి ఈ శత్రువులను జయించే విజయాన్ని అందించి.. మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి.. ఇంకా 30 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలిస్తూ.. అభివృద్ధివైపు పరుగులు తీయించాలని భగవంతుడిని కోరుకున్నాను. నిజం గెలవాలి అంటూ నారా భువనేశ్వరి దేవుడికి పూజలు చేశారు. మేము కూడా నిజమే గెలవాలి అని కోరుకుంటున్నాం. నిజమే గెలిస్తే చంద్రబాబు జీవితాంతం జైలులోనే ఉంటారు. చంద్రబాబు శాశ్వతంగా జైలులోనే ఉండాలని నారా భువనేశ్వరి వెంకటేశ్వరస్వామికి పూజలు చేసినట్లు ఉన్నారు. చంద్రబాబుతో పాటు లోకేశ్, భువనేశ్వరి కూడా జైలులోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. నిజం గెలవాలని ఉంటే.. సీబీఐ ఎంక్వైరీ కోరితే నిజం కచ్చితంగా గెలుస్తుంది. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో కూడా సీబీఐ ఎంక్వైరీ వేస్తే.. హెరిటేజ్ లో ఎవరెవరు ఉన్నారో కూడా అందరూ బయటపడతారు.

నిన్న ఒక మీటింగ్ చూశాను.. పాడుతా తీయగా సెలక్షన్ కి అటో బ్యాచ్ ఇటో బ్యాచ్ కూర్చుని సెలక్ట్ చేసుకున్నట్లు ఉంది. పవన్ కల్యాణ్ టీమ్ ఒకవైపు, లోకేశ్ టీమ్ ఒకవైపు కూర్చోని ఉన్నారు. అంటే అర సున్నా అరసున్నా కూర్చుని లోపల ఉన్న గుండు సున్నా కోసం పార్టీ దశ, దిశా నిర్దేశించాలని వీళ్లు మాట్లాడటం చూస్తుంటే ప్రజలు నిజంగా ఫన్నీగా ఫీలవుతున్నారు. వీళ్లిద్దరు ప్రజలు ఓడించినవాళ్లు. వీళ్లు మా దశ, దిశ నిర్దేశించడం ఏంటంటూ అటు ప్రజలు, ఇటు పార్టీ వాళ్లు ఇందే కర్మరా బాబు అంటూ వాపోతున్నారు. టీడీపీకి 14 సంవత్సరాల మేనిఫెస్టో తీసుకుని మేము ఇది చేశాం అని ఓట్లు గడిపే పరిస్థితి లేదు. కానీ, తొలిసారి సీఎం అయిన జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఇచ్చిన హామీల్లో 98 శాతం పూర్తి చేశారు. మేమంతా ఆంధ్రాకి జగన్ ఎందుకు కావాలో ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడుగుతున్నాం. వై ఏపీ నీడ్స్ జగన్ అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. కానీ, వై ఏపీ నీడ్స్ చంద్రబాబు? వై ఏపీ నీడ్స్ పవన్ కల్యాణ్ అని రాష్ట్ర ప్రజల ముందుకు వెళ్లే దమ్ము వీళ్లకు ఉందా? అలా చేస్తే ప్రజలు మూతి పగలగొడతారని వీళ్లకు తెలిసింది. అందుకే టీడీపీ, జనసేన వాళ్లు ఏపీ హేట్స్ అనే ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టారుఅంటూ మంత్రి రోజా ఎద్దేవా చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి