iDreamPost

సోమిరెడ్డి లాంటి నీచుడిపై పోటీ చేయాలంటే సిగ్గుగా ఉంది: మంత్రి కాకాణి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి..టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సోమిరెడ్డిలాంటి నీచుడిపై పోటీ చేయడం నా దౌర్భాగ్యం అంటూ మంత్రి కాకాణి  అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి..టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సోమిరెడ్డిలాంటి నీచుడిపై పోటీ చేయడం నా దౌర్భాగ్యం అంటూ మంత్రి కాకాణి  అన్నారు.

సోమిరెడ్డి లాంటి నీచుడిపై పోటీ చేయాలంటే సిగ్గుగా ఉంది: మంత్రి కాకాణి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి..టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సోమిరెడ్డిలాంటి నీచుడిపై పోటీ చేయడం నా దౌర్భాగ్యం అంటూ మంత్రి కాకాణి  అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం వావింటపర్తి గ్రామంలో గురువారం వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు జరిగాయి. దీనికి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. టీడీపీ నేత సోమిరెడ్డిపై కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సభలో కాకాణి మాట్లాడుతూ..” ప్రత్యర్థి ఎంత గట్టివాడైతే అంత విలువ మనకు పెరుగుతుందని.. అయితే నా ఖర్మ, నా దురదృష్టం ఏమో కానీ సోమిరెడ్డి లాంటి నీచ రాజకీయాలు చేసే వ్యక్తిపై పోటీ చేయాల్సి వస్తుంది” అని అన్నారు. సోమిరెడ్డిలాంటి వ్యక్తిపై తాను పోటీ చేయడం దౌర్భాగ్యంగా భావిస్తున్నట్లు మంత్రి కాకాణి అన్నారు. ఏమాత్రం రాజకీయ విలువలు లేని వ్యక్తి సోమిరెడ్డని మంత్రి దుయ్యబట్టారు. ఓటమిని అలవాటుగా మార్చుకున్న సోమిరెడ్డి గ్రామాల్లో గొడవలు సృష్టిస్తూ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలపై కక్ష పెంచుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఒక్క గ్రామాన్ని అయినా సోమిరెడ్డి అభివృద్ది చేశాడేమో చెప్పమనండి.. చెప్పలేడు.  సోమిరెడ్డి ఎప్పుడు చూడు గోవర్ధన్ రెడ్డి అవినీతి, అక్రమాలకు పాల్పాడ్డాడు అంటూ ఆరోపణలు మాత్రమే చేస్తున్నాడని మంత్రి తెలిపారు. సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైతుల పంటకు గిట్టుబాటు ధర లేదు. కారణం సోమిరెడ్డి దళారులు, బ్రోకర్ల దగ్గర ముడుపులు తీసుకుని రైతులను మోసం చేశాడని మంత్రి తెలిపారు. తాను అలాంటి వ్యక్తులను దగ్గరకు రానివ్వలేదు కాబట్టే రైతులకు సంబంధించిన గిట్టుబాటు ధర అందుకోగలిగారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

గురువారం సర్వేపల్లి నియోజవర్గంలోని పొదలకూరు మండలం మొగళ్లూరు బ్రాంచిరోడ్డు పనులు రూ.1.13కోట్లతో నిర్మించారు. వావింటపర్తి గ్రామంలో సచివాలయం, రైతుభరోసా  కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలు, సైట్ డ్రైయిన్ల పనులు రూ.2.11 కోట్లతో పూర్తి  అయ్యాయి. వీటన్నిటి గురువారం మంత్రి ప్రారంభించారు.  సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడిఉంటానని, తనను రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిని చేసిన ఘనత ఈ నియోజకవర్గ ప్రజలకే దక్కుతుందని మంత్రి కాకాణి అన్నారు. మరి.. సోమిరెడ్డిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి