iDreamPost

ముఖ్యమంత్రి సహాయనిధికి 5 కోట్ల భారీ విరాళము

ముఖ్యమంత్రి సహాయనిధికి 5 కోట్ల భారీ విరాళము

కరోనా వైరస్ కట్టడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటుంది. లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇళ్లకే పరిమితం అవ్వమని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని మెజారిటి ప్రజలు సైతం తూచాతప్పకుండా పాటిస్తు ప్రభుత్వానికి అండగా నిలబడుతున్నారు. అయితే ప్రభుత్వం సైతం సమర్దవంతంగా కరోనా ని కట్టడి చేయడానికి ఎక్కడికక్కడ క్వారంటైన్లు ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలకు తమ వంతు సాయంగా ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు , సామాన్య ప్రజలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ప్రకటించారు.

ఇప్పటికే రాష్ట్రంలో పలు రంగాల్లో ఉన్న ప్రముఖులు కోవిడ్ వైరస్ ని ఎదుర్కొనేందుకు తమ వంతు సాయంగా విరాళం ప్రకటించగా ఇప్పుడు తాజాగా పారిశ్రామిక వేత్తలు విరాళాలాతో ముందుకు వచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పారిశ్రామిఖ వేత్త మెఘా కృష్ణా రెడ్డి ముఖ్యమంత్రి జగన్ ని కలిసి 5 కోట్లు విరాళం ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రి సహాయనిధికి ఇచ్చే విరాళాల్లో 100శాతం పన్ను రాయతి ఇస్తునట్టు ఇదివరకే ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి