iDreamPost

బాలీవుడ్ హిట్ కోసం మెగా అటెంప్ట్

  • Published Mar 13, 2024 | 8:20 PMUpdated Mar 13, 2024 | 8:20 PM

Megastar Chiranjeevi:స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ పై కూడా చెరగని ముద్ర వేశారు.

Megastar Chiranjeevi:స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ పై కూడా చెరగని ముద్ర వేశారు.

  • Published Mar 13, 2024 | 8:20 PMUpdated Mar 13, 2024 | 8:20 PM
బాలీవుడ్ హిట్ కోసం మెగా అటెంప్ట్

తెలుగు సినిమా పరిశ్రమలో మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ పై కూడా చెరగని ముద్ర వేశారు. చిరంజీవి తరువాత ఆయన కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి స్టార్లతో పాటు వరుణ్ తేజ్, సాయి తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ వంటి యువ హీరోలు కూడా ఉన్నారు. తెలుగు సినిమా వరకూ వీళ్ళ స్టార్ డం కు ఎలాంటి లోటు లేదు. ఇపుడు అదే ఎఫెక్ట్ బాలీవుడ్ లో వచ్చేలా ఒక స్ట్రాంగ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు.

గతంలోకి మెగాస్టార్ చిరంజీవి 1990లో ప్రతిబంధ్ అనే హిందీ చిత్రాన్ని విడుదల చేయగా… ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. ఈ చిత్రం హిందీలో రాజశేఖర్ అంకుశంకు రీమేక్‌గా విడుదలైంది. ఆ తరువాత గ్యాంగ్ లీడర్ సినిమాని హిందీలో కూడా ఆజ్ కా గుండా రాజ్ పేరుతో రీమేక్ చేయగా ఆ సినిమా కూడా విజయం సాధించింది. ఆ తర్వాత తమిళ, తెలుగు భాషల్లో సూపర్‌హిట్‌ అయిన జెంటిల్మెన్ చిత్రాన్ని హిందీలో చిరంజీవి ప్రధాన పాత్రలో రీమేక్‌ చేశారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ అనిపించుకుంది. ఆ తరువాత నుంచి ఇప్పటి వరకూ చిరంజీవి బాలీవుడ్‌లో స్ట్రెయిట్ గా సినిమా చేయలేదు. 2019లో పాన్ ఇండియా స్థాయిలో తీసిన సైరా నరసింహ రెడ్డి సినిమాని హిందీలో డబ్ చేసి రిలీజ్ చేశారు. మెగాస్టార్ నటనకు మంచి ప్రశంసలు లభించినా… నార్త్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు.

ఇక రామ్ చరణ్ గతంలో అమితాబ్ బచ్చన్ ఓల్డ్ క్లాసిక్ జంజీర్ రీమేక్ తో హిందీ పరిశ్రమలో అడుగుపెట్టారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే కొన్నేళ్ల తరువాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ తో సూపర్ హిట్ అందుకున్నారు. ఇక నటుడిగా కూడా రామ్ చరణ్ కు మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ తో మరోసారి బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కొట్టాలని ఉత్సాహంతో ఉన్నారు. గేమ్ ఛేంజర్ గనక అంచనాలను అందుకుంటే పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు కొల్లగొట్టడం ఖాయమనే చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు. ఆ సినిమా హిందిలో అంతగా ఆడలేదు. యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజీ సినిమాతో మరోసారి హిందిలో అడుగు పెట్టనున్నారు.

ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవకల ఆపరేషన్ వాలెంటైన్‌ను తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేశారు. ఈ సినిమా పబ్లిసిటీ కోసం ఎంతో కష్టపడ్డ వరుణ్ ఎన్నో ప్రమోషనల్ యాక్టివిటీస్ లో పాల్గొన్నా కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే తన తరువాత సినిమా మట్కాతో మరోసారి పాన్-ఇండియా స్థాయిలో హిట్టు కొట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ మూడు విభిన్నమైన గెటప్స్ లో నిపించనున్నారని, పాత్ర కోసం బరువు పెంచి లావుగా కూడా కనిపిస్తారని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా విశ్వంభర అనే ఫాంటసీ సినిమాతో తన స్టామినా చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి జానర్ సినిమాలకు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు కాబట్టి హిందీలో విశ్వంభర పెద్ద విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. మరి క్రేజీ మూవీస్ తో వస్తున్న మెగా హీరోలు బాలీవుడ్‌లో వరుస బ్లాక్ బస్టర్స్ కొడతారని ఆశిద్దాం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి