iDreamPost

రామ్ చరణ్ కూతురిని చూశారా? అప్పుడే జెండా ఎగరేసింది! క్యూట్ పిక్స్ వైరల్!

  • Author ajaykrishna Updated - 08:57 AM, Wed - 16 August 23
  • Author ajaykrishna Updated - 08:57 AM, Wed - 16 August 23
రామ్ చరణ్ కూతురిని చూశారా? అప్పుడే జెండా ఎగరేసింది! క్యూట్ పిక్స్ వైరల్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఉపాసన దంపతులు ఇటీవల పేరెంట్స్ అయిన సంగతి తెలిసిందే. మెగా వారసురాలికి జన్మనిచ్చిన ఈ జంట.. కూతురికి ‘క్లీంకార’ అనే పేరు కూడా పెట్టారు. దీంతో చాలా కాలంగా ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్.. తమ అభిమాన హీరో తండ్రి కావడంతో ఎంతో హ్యాపీ అయిపోయారు. అయితే.. ఎప్పుడెప్పుడు క్లింకారాని చూద్దామా అని అభిమానులు ఆశగా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి ఇండిపెండెన్స్ డే సందర్బంగా చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు ఈ మెగా కపుల్. క్లింకారా తన అమ్మమ్మ, తాతయ్యతో కలిసి ఇండిపెండెన్స్ డే సెలెబ్రేట్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం క్లింకారా క్యూట్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

77వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా.. మెగా చిన్నారి క్లింకారా.. తన అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి జెండా ఎగరేసింది. ఉపాసన తల్లి శోభన, తండ్రి అనిల్ కామినేని.. మనవరాలితో కలిసి సెలెబ్రేట్ చేసుకున్నారు. వారి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఉపాసన. అయితే.. పాప ముఖం పూర్తిగా రివీల్ చేయకుండా ట్విస్టు ఇచ్చారు. కొంతవరకే ముఖం చూపిస్తూ.. పిక్స్ షేర్ చేశారు. వీలైనంత త్వరగా క్లింకారా ఫోటోలు రిలీజ్ చేసే అవకాశం ఉందని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరోవైపు మెగా వారసురాలి క్యూట్ ఫోటోలు చూస్తూ.. ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇదిలా ఉండగా.. రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులు అయ్యాక.. తమ కూతురి విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. ఇక కెరీర్ పరంగా రామ్ చరణ్.. డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా.. వచ్చే ఏడాది థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే భారీ అంచనాలు సెట్ చేసిన ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. పీరియడిక్ పొలిటికల్ యాక్షన్ జానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా అనంతరం.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తదుపరి సినిమా చేయనున్నాడు చరణ్. మరి చరణ్ – ఉపాసనల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి