iDreamPost

ట్విట్టర్ లో మెగాపవర్ స్టార్ ఎంట్రీ

ట్విట్టర్ లో మెగాపవర్ స్టార్ ఎంట్రీ

నిన్న నాన్న మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ప్రపంచంలోకి వచ్చిన వేళా విశేషమేమో కానీ ఇవాళ రామ్ చరణ్ కూడా రంగంలోకి దిగిపోయాడు. ఇప్పటిదాకా చరణ్ కు ఫేస్ బుక్ పేజి మాత్రమే ఉంది. తన నుంచి ఎలాంటి అప్ డేట్ వచ్చినా అభిమానులు దాని మీదే ఆధారపడాల్సి వచ్చేది. కాని అధిక శాతం వాడుతున్న ట్విట్టర్ లోకి రమ్మని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా చరణ్ రెస్పాండ్ కాకుండా వచ్చాడు. గతంలో ఉండేది కాని ఏవో కారణాల వల్ల తన ఎకౌంటుని వదిలేసిన చెర్రి ఇన్నేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇవ్వడం పట్ల మెగాభిమానులు యమా హ్యాపీగా ఉన్నారు.

ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ నిన్న విడుదలై సంచలనం సృష్టించింది. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ల లుక్స్ పూర్తిగా రివీల్ చేయనప్పటికీ టైటిల్ ని చెప్పేయడం, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కీరవాణి మెప్పించడం లాంటివి మోషన్ పోస్టర్ ని ఎక్కడికో తీసుకెళ్ళాయి. తాజాగా ఒక మంచి ఉద్దేశంతో చరణ్ తన ట్విట్టర్ ప్రయాణం మొదలుపెట్టేశాడు. కరోనా నివారణ నిమిత్తం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తన వంతుగా 70 లక్షల విరాళాన్ని ప్రకటించాడు. పవన్ కళ్యాణ్ ఇంత భారీగా మొత్తాన్ని ఇచ్చింది చరణే.

మిగిలిన హీరోలు స్పందించారు కానీ ఆ అమౌంట్ దీని కన్నా ఎక్కువగానే ఉంది. మరోవైపు చిరంజీవి సైతం చరణ్ కు స్వాగతం చెబుతూ సింహాన్ని అనుసరించాల్సిందేనని ట్వీట్ చేయడం ఫాన్స్ కు స్వీట్ గా తోస్తోంది. ఒక రోజు గ్యాప్ లో చరణ్ చిరులు ఇలా జాయింట్ గా ఎంట్రీ ఇవ్వడాన్ని ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. 24 గంటల్లో వచ్చిన ఫాలోయర్స్ కౌంట్ పరంగా ఇప్పటికే పవన్ స్థానాన్ని దాటేసి రెండో ప్లేస్ లోకి వచ్చిన చిరుని చరణ్ ఓవర్ టేక్ చేస్తాడేమో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటిదాకా చిరు కానీ చరణ్ కానీ ఆచార్య గురించి ఎలాంటి ఊసు ఎత్తకపోవడం గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి