iDreamPost

వీడియో: విజయ్‌పై మీడియా తప్పుడు ప్రచారం.. అసలు జరిగింది ఇదే!

వీడియో: విజయ్‌పై మీడియా తప్పుడు ప్రచారం.. అసలు జరిగింది ఇదే!

తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమించారంటూ.. ఆయనకు పెద్ద మొత్తంలో ఫైన్‌ పడిందంటూ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇందుకు సంబంధించి ఓ సంచలన వీడియో తాజాగా, వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో ఆధారంగా విజయ్‌పై మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఒట్టి అబద్దాలే అని తేలిపోయింది. దీంతో ఫ్యాన్స్‌ ఆ వీడియోను షేర్‌ చేస్తూ విజయ్‌పై తప్పుడు వార్తలు రాసిన మీడియా వారిపై మండిపడుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..

హీరో విజయ్‌ తన కారులో రోడ్డుపై వెళుతూ ఉన్నారు. ఓ చోట సిగ్నల్‌ పడటంతో విజయ్‌ కారు ఆగిపోయింది. అది కూడా జీబ్రా క్రాసింగ్‌ అవతలే కారు ఆగిపోయింది. గ్రీన్‌ పడిన తర్వాతే విజయ్‌ కారు ముందుకు కదిలింది. ఈ దృశ్యాలను విజయ్‌ ఫ్యాన్స్‌తో పాటు కొంతమంది మీడియా సభ్యులు కూడా వీడియో తీశారు. విజయ్‌ ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమించారన్న తప్పుడు వార్తలు రావటంతో.. విజయ్‌ ఫ్యాన్స్‌ ఈ వీడియోను తమ సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశారు. ఆ వీడియోలో విజయ్‌ ట్రాఫిక్‌ రూల్స్‌ను అతిక్రమించలేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది.

దీంతో ఆ వీడియోను చూస్తున్న దళపతి ఫ్యాన్స్‌ తమ హీరోపై తప్పుడు వార్తలు రాసిన మీడియా వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, విజయ్‌ ప్రస్తుతం లోకేష్‌ కనగరాజ్‌తో కలిసి ‘లియో’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్‌ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, అట్లీ దర్శకత్వంలో షారుఖ్‌ ఖాన్‌ హీరోగా నటించిన ‘జవాన్‌’ సినిమాలోనూ గెస్ట్‌ రోల్‌ చేశారు. లియో తర్వాత విజయ్‌ ఏ సినిమాకు సంతకం చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న ప్రచారం బాగా జరుగుతోంది. మరి, ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమించారంటూ విజయ్‌పై తప్పుడు వార్తలు రావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి