iDreamPost

మెడ్ టెక్ జోన్ మాత్రమేనా లేక మేక్ ఇన్ ఇండియా కూడా బాబు బ్రెయిన్ చైల్డేనా?

మెడ్ టెక్ జోన్ మాత్రమేనా లేక  మేక్ ఇన్ ఇండియా కూడా బాబు బ్రెయిన్ చైల్డేనా?

చంద్రబాబు నాయుడు గారికి గోరంత వ్యవహారానికి కొండంత ప్రచారం చేసుకోవడం అలవాటు. ఆరంభంలోనే మహా అద్బుతమని మీడియాలో ప్రచారం చేయించుకోవడంలో మహా దిట్టగా చెబుతారు. ఆయనకు తెలిసినట్టుగా మీడియా మ్యానేజ్మెంట్ ఇక దేశంలో ఏ రాజకీయ నాయకుడికి తెలియదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వై.యస్ హయాంలో సగానికి పైగా పనులై రాష్ట్రానికే ప్రాణవాయువులా నిలిచిన పోలవరం ప్రాజెక్టు పై ఆయన చేసుకున్న ప్రచారం చూశాం, ఏకంగా చార్ ధాం యాత్ర మాదిరి బస్సులు పెట్టి మరీ ప్రజలను తీసుకెళ్ళి చూపించారు. జయము జయము చంద్రన్న అని కీర్తనలు పెట్టించారు. అటువంటి వ్యక్తి హయాములో ఆసియా ఖండంలోనే లేనంత ఒక పెద్ద ప్రాజెక్టు వస్తే దాని పై జరిగే ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. కానీ 2016లో మొదలై , 2018 డిశంబర్లో ప్రారంభం అయిన విశాఖ మెడ్ టెక్ జోన్ ప్రాజెక్టు ఈ ప్రచారానికి నోచుకోలేదు. మీడియా సైతం నాడు దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. కారణం ఏమై ఉంటుంది.

నిజానికి ఈ ప్రాజెక్టు పై చంద్రబాబు నేడు చెప్పుకుంటున్నట్టు నాడు చెప్పుకోలేక పోవటానికి కారణం ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టిన మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలోనిది కావడమే. దేశంలో ఉత్పాదక రంగం వృద్ధి రేటు పెరుగదలకు తోడ్పడేలా కేంద్రప్రభుత్వం ఒక్కొక్క ప్రదేశాన్ని ఒక్కొక్క జోన్ గా ఎంచుకుంది, అందులో బాగంగా ఆంద్రప్రదేశ్ ని మెడ్ టెక్ జోన్ గా ఎంచుకున్నది. ప్రతి సంవత్సరం ఎక్సరే , సిటీస్కాన్ లాంటి సుమారు 70వేల కోట్ల రూపాయల యంత్ర పరికరాలు విదేశాల నుండి కొనుగోలు చేస్తున్న నేపద్యంలో నాటి కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ రీసెర్స్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసి దాని సూచనల మేరకు ఆసియా ఖండంలోనే అతిపెద్ద సంస్థగా మెడ్ టెక్ జోన్ ని తయ్యారు చెయ్యాలని సంకల్పించి విశాఖ కేంద్రంగా అవసరమైన భూమిని దీనికి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నాటి కేంద్ర ప్రభుత్వం సూచించింది.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి రంగంలోకి దిగిన చంద్రబాబు హయంలోని రాష్ట్ర ప్రభుత్వం 2016లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఆనుకుని ఉన్న అత్యంత విలువైన 270 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ మెడ్ టెక్ జోన్ కి కేటాయిస్తున్నట్టు చెప్పుకొచ్చారు . ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ జోన్ లోకి అడుగు పెట్టిందో నాటి నుండి తెలుగుదేశంలోని పెద్దలు ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో భారీగా నిధులు కొల్లగొట్టడానికి ప్రణాళికలు సిద్దం చేసుకొన్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను నిజం చేస్తూ 270 ఎకరాల ప్రభుత్వ భూమిని భవనాల నిర్మాణం , భూమి చదును కోసం 2017లోనే టెండర్లు పిలిచారు. వాస్తవంగా 500కోట్లతో అయిపోయే పనులని 2,400 కోట్లకు సుమారు 300% అధికంగా ల్యాంకో ఇన్ ఫ్రా కు అప్పచెప్పారు. అప్పటికే ఈ సంస్థ రిమ్స్‌ల నిర్మాణం సకాలంలో చెయ్యలేకపోయారని ప్రభుత్వమే ఆ సంస్థకు పెనాల్టీ వేసి, కాంట్రాక్టు రద్దు చేసింది.

ఇలా రద్ధు చేసిన సంస్థకు 300% కు పెంచి పనులు అప్పచెప్పడం వెనక, ఆనాడు లగడపాటి రాజ్ గోపాల్ కు లబ్ది చేకూర్చడానికే ప్రభుత్వ పెద్దలు చక్రం తిప్పారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఒక పక్క రాష్ట్రపతి రాం నాద్ కోవింద్ లంటి వారు చైనా వెళ్ళి ఎం.ఒ.యులు కుదుర్చుకుని వస్తే, చంద్రబాబు చేతుల మీదగా ఈ మెడ్ టెక్ జోన్లో బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీలకు, ఊరు పేరు లేని కంపెనీలతో ఏం.ఓ.యులు చెసుకోవడమే కాకుండా ఏకంగా ఎకరం 5కోట్లు చొప్పున మొత్తం 1,350 కోట్లు విలువ చేసే భూమిలో అనుయాయులకు , నచ్చిన వారికి ఎకరం 25 లక్షల కంటే తక్కువ దరకు 33ఏళ్ళ కు లీజుకు కట్టబెట్టారు. ఇలా చంద్రబాబు ప్రభుత్వంలో అడుగడుగునా అవినీతి మరకలతో అప్రదిష్ట పాలైన మెడ్ టెక్ జోన్ జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే కొత్త ప్రభుత్వం గతంలో జరిగిన వందల కోట్ల అక్రమాలపై దృష్టి సారించింది. నాడు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నివేదిక ఇవ్వలని అధికారులను కోరింది. కొత్తగా మెడ్ టెక్ జోన్ కు బోర్డ్ అఫ్ డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్ గా మరో 11 మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులను ఈ కమిటీలో సభ్యులను నియమించారు.

చంద్రబాబు ప్రభుత్వంలో అడుగడుగునా అవినీతి మరకలతో అప్రదిష్ట పాలైన మెడ్ టెక్ జోన్ ను నేడు చంద్రబాబు తెలుగుదేశం శ్రేణులు తమ ఖాతాలో వేసుకొవాలనే ఆలోచనతో ప్రచారం మొదలుపెట్టడం శోచనీయం. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన మెడ్ టెక్ జోన్ కి అవినితి మరకలు అంటించటమే కాకుండా దాని ప్రతిష్టను దిగజార్చేలా నాడు వ్యవహరించిన తెలుగుదేశం నేడు దాని పేరును సొంతం చేసుకోవాలని చూడటం చంద్రబాబు పబ్లిసిటి నైజాన్ని మరో సారి బహిర్గతం చేసినట్టయింది .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి