iDreamPost

పాపం మెక్ డొనాల్డ్స్.. వేడి వేడి ఆహారం పెట్టారని కోట్లలో ఫైన్ వేశారు!

పాపం మెక్ డొనాల్డ్స్.. వేడి వేడి ఆహారం పెట్టారని కోట్లలో ఫైన్ వేశారు!

మీరు ఏ హోటల్ కి వెళ్లినా.. ఏ రెస్టారెంట్ కి వెళ్లినా కూడా మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ వేడి వేడిగా కావాలి అంటారు. కాస్త చల్లగా ఉన్నా కూడా ఎందుకు ఇంచ చల్లగా సర్వ్ చేశారు అంటూ గొడవకు కూడా దిగుతారు. కానీ, వేడి వేడిగా ఫుడ్ సర్వ్ చేసినందుకు మెక్ డొనాల్డ్స్ కు భారీ షాక్ తగిలింది. ఒక కస్టమర్ కుటుంబం కోర్టుకు ఎక్కడంతో లక్షల డాలర్లు జరిమానాగా కట్టాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత వేడిగా ఫుడ్ సర్వ్ చేయడం కూడా తప్పా? అని చాలా మంది నోరెళ్లబెడుతున్నారు.

ఈ ఘటన నాలుగేళ్ల క్రితం ఫ్లోరిడాలో జరిగింది. ఫిలానా హోమ్స్, ఆమె భర్త, తమ నాలుగేళ్ల కుమార్తె ఒలివియా కారబల్లోతో మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ కి వెళ్లారు. అప్పుడు ఆ చిన్నారి కోసం వాళ్లు హాట్ చికెన్ మెక్ నగెట్స్ ని ఆర్డర్ చేశారు. వాళ్లు వేడి వేడిగా నగెట్స్ ని సర్వ్ చేశారు. ఆ నగెట్స్ ని తినే క్రమంలో చిన్నారి తన తొడ మీద పడేసుకుంది. ఆ నగెట్ పడిన దగ్గర ఆమె తొడకు తీవ్ర గాయమైంది. ఆ తర్వాత ఫిలానా హోమ్స్ కుటుంబం మెక్ డొనాల్డ్స్ నిర్వాకులతో గొడవకు దిగారు. అక్కడితో ఆగకుండా తమకు న్యాయం చేయాలంటూ కోర్టుకెళ్లారు. నిజానికి మెక్ డొనాల్డ్స్ వాళ్లు చికెన్ ని 160 డిగ్రీల కంటే హీట్ చేయకూడదు. కానీ, ఆ చికెన్ నగ్గెట్స్ 200 డిగ్రీల వేడిగా ఉన్నట్లు కస్టమర్స్ వాదించారు.

అందుకు సాక్షంగా చిన్నారికి జరిగిన గాయం, ఆమె పడిన బాధను ఆధారంగా చూపారు. ఆ ఒక్కసారి తప్ప వారికి ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని చెప్పారు. తమ కుమార్తె ఇప్పటికీ చికెన్ నగ్గెట్స్ తింటోందని తెలిపారు. వీరి వాదన విన్న కోర్టు మెక్ డొనాల్డ్స్ వాళ్లు చేసింది తప్పు అని భావిచింది. ఫిలానా హోమ్స్ కుటుంబానికి ఫేవర్ గా తీర్పు ఇచ్చింది. ఏకంగా మెక్ డొనాల్డ్స్ కు రూ.6.5 కోట్లు ఫైన్ విధించారు. ముందుగా రూ.3.27 కోట్లు వెంటనే చెల్లించాలని స్పష్టం చేశారు. మిగిలిన మొత్తాన్ని నిర్ణీత గడువులో చెల్లించ వచ్చని చెప్పారు. ఈ కేసు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పాపం మెక్ డొనాల్డ్స్ పరిస్థితి చూసి వేడిగా ఆహారం సర్వ్ చేయడం కూడా కొన్నిసార్లు తప్పే బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి