iDreamPost

కొత్త కారు కొనాలనుకునే వారికి షాకిచ్చిన మారుతీ సుజుకీ.. కార్ల ధరల పెంపు!

మీరు ఈ మధ్య కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? మారుతీ సుజుకీ కార్లు మరింత ప్రియం కానున్నాయి. కార్ల ధరలు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో మారుతీ కార్లు మరింత ప్రియం కానున్నాయి.

మీరు ఈ మధ్య కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? మారుతీ సుజుకీ కార్లు మరింత ప్రియం కానున్నాయి. కార్ల ధరలు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో మారుతీ కార్లు మరింత ప్రియం కానున్నాయి.

కొత్త కారు కొనాలనుకునే వారికి షాకిచ్చిన మారుతీ సుజుకీ.. కార్ల ధరల పెంపు!

కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందంటే చాలు ఆర్థికపరమైన అంశాల్లో మార్పులు చేసుకుంటుంటాయి. కొన్ని వస్తువులు ధరలు తగ్గుముఖం పడితే, మరికొన్నింటి ధరలు మాత్రం ఆకాశాన్నంటుతుంటాయి. ఏదేమైనప్పటికీ జనాల జేబులకు చిల్లులు పడడం మాత్రం ఖాయం. ఈ క్రమంలో కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్న వారికి భారీ షాక్. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కస్టమర్లకు షాకిచ్చింది. దాదాపు అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంతో పండగ వేళ కొత్త కారు తీసుకునే వారికి భారీ షాక్ తగిలినట్లైంది. పెరిగన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.

గతేడాది మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటామోటార్స్, మహింద్రా ఇలా పలు కంపెనీలు తమ కార్ల ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ వివిధ మోడల్ కార్ల ధరలు పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటన చేసింది. దాదాపు అన్ని మోడళ్లపై 0.45 శాతం మేర థరలు పెరుగుతాయని కంపెనీ వెల్లడించింది. నిర్వహణ వ్యయాలు, ముడి సరుకుల ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం పెరగడం కారణంగా ధరలు పెంచాల్సి వచ్చిందని మారుతీ సుజుకీ చెప్పుకొచ్చింది. ధరల పెంపుతో మారుతీ సుజుకీ కార్ల ధరలు మరింత ప్రియం కానున్నాయి. కార్లపై పెంచిన కొత్త రేట్లు జనవరి 16, 2024 నుంచే అమల్లోకి వస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.

మారుతి సుజుకి దేశీయ విపణిలో ప్యాసింజర్ కార్ల విక్రయంలో అగ్ర స్థానంలో ఉంది. ఈ కంపెనీకి చెందిన స్విఫ్ట్, వ్యాగన్ ఆర్, బాలెనో, బ్రెజ్జా మరియు ఎర్టిగాలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. మారుతి భారతీయ కార్ల మార్కెట్‌లో దాదాపు 50% వాటా కలిగి ఉంది. తక్కువ ధర, మంచి మైలేజ్ కారణంగా, ఈ కంపెనీ కార్లు భారతదేశంలోని మధ్యతరగతి కుటుంబాల నుంచి మంచి ఆధరణ లభించింది. మరి మారుతీ సుజుకీ కార్ల ధరలను పెంచడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి