iDreamPost

మటన్ బిర్యానీ లేదని పెళ్లిని వాయిదా వేశారు.. ఇదంతా జొమాటో వల్లే..

మటన్ బిర్యానీ లేదని పెళ్లిని వాయిదా వేశారు.. ఇదంతా జొమాటో వల్లే..

పెళ్ళిలో అన్నిటికంటే ముఖ్యం భోజనాలు. వచ్చిన అతిదులకి కడుపునిండా భోజనం పెట్టి పంపించడం మన సాంప్రదాయం. అందుకు ఇటీవల చాలా మంది పెళ్లిళ్లలో భోజనాలకు ఎక్కువ ఖర్చు చేస్తూ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే తాజాగా ఓ పెళ్లిలో మటన్ బిర్యానీ లేకపోవడంతో పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఈ సంఘటన తమిళనాడులోని సేలంలో జరిగింది.

ఓ పెళ్లి కుటుంబం తమ ఇంట్లో పెళ్ళికి వచ్చే అతిధులకు మంచి మటన్ బిర్యానీ పెట్టాలని నిర్ణయించుకుంది. దీంతో తమిళనాడు సేలంలోని RR బిర్యానీ పాయింట్ వారికీ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. దీంతో ఈ బిర్యానీ సెంటర్ నిర్వాహకులు మటన్ బిర్యానీ తయారు చేయడానికి జొమాటోలో 3,500 కిలోల మాంసాన్ని ఆర్డర్ చేశారు. అయితే జొమోటో బెంగళూరు నుంచి తమిళనాడుకు వాళ్ళు ఆర్డర్ చేసిన మటన్, చికెన్‌ని పార్శిల్ చేసింది.

పెళ్లి రోజు బిర్యానీ తయారు చేద్దామని చూడగా వచ్చిన మాసం కుళ్లిపోయి ఉంది. ఇది గమనించిన పెళ్లి బృందం ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి అది కుళ్లిన మాంసమేనని తేల్చారు. దీనిపై వివరణ ఇవ్వాలని జొమాటోకి, RR బిర్యానీ పాయింట్ కి నోటీసులు జారీ చేశారు. అయితే కుళ్ళిన మాంసం రావడంతో అప్పటికప్పుడు అంతమందికి బిర్యానీ అందించడం కుదరదని చెప్పడంతో వ‌చ్చిన బంధువుల‌కు మటన్ బిర్యానీ లేకుండా భోజ‌నం పెట్టమని పెళ్లి వాయిదా వేసుకుంటామని నిర్ణయించుకున్నారు. ఇందుకు వ‌ధూవ‌రుల కుటుంబసభ్యులు ఇద్దరూ ఆమోదం తెలపడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి