iDreamPost

మామిడి కాయలు కోసం ఎదురుచూస్తున్నారా? ఈసారి కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే!

సమ్మర్ వచ్చేసింది.. పిల్లలకు సెలవులను తెచ్చింది. నాన్నమ్మ, అమ్మమ్మ ఇళ్లకు పయనం కమ్మంది. వారి చేత గోరు ముద్దులు తినేందుకు మనస్సు ఊవిళ్లూరుతుంది. అందులోనూ పెరుగన్నంలో మామిడి రసం పిండి గుజ్జుగా కలుపుకుని తింటే..

సమ్మర్ వచ్చేసింది.. పిల్లలకు సెలవులను తెచ్చింది. నాన్నమ్మ, అమ్మమ్మ ఇళ్లకు పయనం కమ్మంది. వారి చేత గోరు ముద్దులు తినేందుకు మనస్సు ఊవిళ్లూరుతుంది. అందులోనూ పెరుగన్నంలో మామిడి రసం పిండి గుజ్జుగా కలుపుకుని తింటే..

మామిడి కాయలు కోసం ఎదురుచూస్తున్నారా? ఈసారి కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే!

వేసవి కాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో దొరికే అరుదైన పండ్లు, పూల కోసం ఎంతగానే ఎదురుచూస్తుంటారు ప్రజలు. తాటికాయలు, సీమ చింతకాయలు, మామిడి పండ్లు, మల్లెపూలు. ఎండాకాలంలో మాత్రమే విరివిగా లభిస్తుంటాయి. అయితే చాలా మంది ఈగర్‌గా వెయిట్ చేసేది మాత్రం మామిడి పళ్ల కోసమే. పండ్లలో రారాజుగా గుర్తించబడిన ఈ పండు రుచిలో కూడా కింగే. మామిడి చూస్తుంటేనే నోరూరుతూ ఉంటుంది. ఇక స్మెల్ వస్తే టెంప్ట్ కావాల్సిందే. తింటుంటే మనస్సు ఏటో వెళ్లిపోతూ ఉంటుంది.  మామిడి పళ్లలో రసాలు, బంగిన పల్లి, నీలాలు, చిలుక మామిడి, కొబ్బరి మామిడి, సువర్ణ రేఖ, తోతాపురి, కలెక్టర్, జలాలు ఇలా చెప్పుకుంటే చానా రకాలు లభిస్తుంటాయి. వేటిని వదలి పెట్టరు.

సంవత్సరానికి సరిపడా నిల్వ పచ్చడి పట్టడంతో పాటు జ్యూస్ కూడా చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ సారి మామిడి కాయలు/ పళ్లు అందని ద్రాక్షలా మారేటట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తొలి పంట చేతికి వచ్చేసింది. కానీ రైతు పరిస్థితి మాత్రం చూసి మురవ, చెప్పుకోలేక ఏడవ అన్నట్లుగా తయారయ్యింది. గతంతో పోల్చుకుంటే.. మామిడి దిగుమతి బాగానే ఉంది. చెట్టు నిండా కాయలు ఉన్నాయి. కానీ రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు. తీరా కొనేందుకు వెళితే మార్కెట్‌లో ధర చెమటలు పట్టిస్తోంది. గత ఏడాది కంటే మామిడి పళ్ల రేట్లు పెరిగాయి. దీంతో జనాలు ఏంటీ ఈ రేట్లు.. ఎండ కన్నా ఘోరంగా మండిపోతున్నాయి అనుకుంటున్నారు. దీనికి కారణం దళారి.  అటు రైతుకు, ఇటు కస్టమర్లకు వారధిగా వ్యవహరిస్తున్న దళారి ఇప్పటికే తన దందాను కొనసాగిస్తున్నారు.

Mangoes

రైతును బెదరకొట్టి తక్కువ ధరకు మామిడి పళ్లను కొనుగోలు చేసి.. మార్కెట్ తీసుకు వచ్చి అత్యధిక ధరలకు కొనుగోలు చేస్తున్నాడు. ఇటీవల అకాల వర్షాలు కురియడంతో కొన్ని చోట్ల మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు రైతు తిప్పలు పడుతుంటే..దళారి మాత్రం నిప్పులపై కంకులు కాల్చుకుంటున్నాడు. వారి ఆవేదనను మరింత క్యాష్ చేసుకుంటున్నాడు. మళ్లీ వర్షాలు రావచ్చునని, పంట దెబ్బతింటుందని లేదా పురగులు పట్టొచ్చని, పంటకు నష్టం చేకూర్చవచ్చునని ఓ రకమైన బెదిరింపుతో రైతును అయోమయ గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టి.. తను పబ్బం గడుపుకుంటున్నాడు. దీంతో రైతు చేసేదేమీ లేక అత్యంత తక్కువ ధరకు ఇచ్చేస్తున్నాడు.

కానీ బహిరంగ మార్కెట్ వచ్చేసరికి మామిడి పళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సీజన్‌లో డిమాండ్ ఉంటే బంగినపల్లి, పెద్ద రసాలు అయితే మరింత రేటు పలుకుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధర పలుకుతున్నాయి మామిడి పళ్లు. తెలంగాణలో కేజీ ధర రూ. 100 పై చిలుకు చూపిస్తోంది. ఇక ఏపీలో డజన్ బంగిన పల్లి ధర రూ. 500 పలుకుతోంది. ఇక నోరూరించే రసాలు అయితే ఇంకా ఎక్కువ చెబుతున్నారని వినికిడి. గతంలో అయితే పెద్ద రసాలు డజన్ సుమారు రూ. 300 నుండి పలికేది. కానీ ఇప్పుడు ఆ రేటు పెరిగిందని తెలుస్తోంది. ఇది చూడబోతే రైతుకు కష్టకాలం.. కస్టమర్లకు ప్రాణ సంకటంలా మారింది. ఇక మామిడి పళ్లు తినాలంటే.. సామాన్యులు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి