iDreamPost

మంగళగిరిలో వ్యూహం మార్చిన CM జగన్.. ఈ దెబ్బతో లోకేశ్ ఔట్?

YS Jagan: ఏపీలోనే కాకుండా దేశ రాజకీయాల్లో సైతం సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యకంగా నిలుస్తున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రత్యర్థి పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. తాజాగా మంగళగిరి విషయంలో సీఎం జగన్ వేసిన కొత్త స్కెచ్ కి టీడీపీ షాక్ లోకి వెళ్లింది.

YS Jagan: ఏపీలోనే కాకుండా దేశ రాజకీయాల్లో సైతం సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యకంగా నిలుస్తున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రత్యర్థి పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. తాజాగా మంగళగిరి విషయంలో సీఎం జగన్ వేసిన కొత్త స్కెచ్ కి టీడీపీ షాక్ లోకి వెళ్లింది.

మంగళగిరిలో వ్యూహం మార్చిన CM జగన్.. ఈ దెబ్బతో లోకేశ్ ఔట్?

రాజకీయాల్లో వ్యూహాలు అనేవి నిరంతర ప్రక్రియ. ఒక్కటే ప్లాన్ వేసి.. అదే అమలు చేస్తాను అంటే.. ఈ రాజకీయ చదరంగంలో విజయం సాధించలేరు. పరిస్థితులను బట్టి.. వ్యూహాలు మార్చుకుంటూ ప్రత్యర్థి ఊహలకు కూడా అందని విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. అలా వేసే ప్రణాళికలకు  ప్రత్యర్థులు దెబ్బకు ఔట్ అవ్వాల్సిందే. ఇలా రాజకీయాల్లో వ్యూహత్మకంగా అడుగులు వేసేవారు చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి వారిలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకరు. ఇప్పటి వరకు ఆయన తీసుకున్న నిర్ణయాలకు ప్రతిపక్ష పార్టీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. తాజాగా మంగళగిరిలో కొత్త వ్యూహంతో ముందుకు వచ్చారు. సీఎం జగన్ వేసిన ఈ కొత్త స్కేచ్ తో ఇక నారా లోకేశ్ ఔటేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇలా కేవలం లక్ష్యాన్ని పెట్టుకోవడమే కాకుండా..దానికి తగిన ప్రణాళికలను, వ్యూహాలను రచిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు, బాలకృష్ణ, నారా లోకేశ్ వంటి టీడీపీ కీలక నేతలను ఓడించడమే లక్ష్యంగా సీఎం జగన్ పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతంలోని నియోజకవర్గమైన మంగళగిరిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. మరోసారి కూడా లోకేశ్ ను ఇక్కడ ఓడించాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది.

ఈ క్రమంలోనే రెండు సార్లు గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టి.. స్థానిక నేత అయిన గంజి చిరంజీవిని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయంతో టీడీపీకి ఏమీ పాలుపోలేదు. అయినా స్థానికంగా పర్యటిస్తూ.. లోకేశ్ ఎలాగైనా విజయం సాధించాలని తెగ ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో శుక్రవారం వైఎస్సార్ సీపీ విడుదల చేసిన తొమ్మిదో జాబితాను చూసి టీడీపీకి మైండ్ బ్లాక్ అయిందనే టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం..మంగళగిరిలో గంజి చిరంజీవి బదులు కొత్త అభ్యర్థిని వైసీపీ అధిష్టానం ప్రకటించింది. మురుగుడు లావణ్యను మంగళగిరి కొత్త ఇన్ ఛార్జీగా ప్రకటించింది. ఈమె మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె, అలానే మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు.

గతంలో హనుమంత రావు వైఎస్సార్ కేబినేట్ లో మంత్రిగా కూడా పని చేశారు. దీంతో పుట్టిల్లు, అత్తగారిల్లు రాజకీయ నేపథ్యం కలిగినవి. ఇలా గంజి చిరంజీవి, కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావు మద్దతులో మంగళగిరి వైసీపీ అభ్యర్థిగా లావణ్య బరిలో దిగనున్నారు. ఈక్రమంలో వచ్చే ఎన్నికల్లో ఆమె గెలుపు నల్లేరుమీద నడకే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయంతో టీడీపీ గట్టి షాక్ తగిలినట్లు అయింది. ఇలా అన్నివైపుల నుంచి బలమైన మద్దతు ఉన్న లావణ్యను బరిలో దించడంతో వచ్చే ఎన్నికల్లో లోకేశ్ ఓటమి ఖామని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మొత్తంగా సీఎం జగన్ వేసిన కొత్త స్కెచ్ కి నారా లోకేశ్ ఔట్ అనే అభిప్రాయాలు వినిపిస్తోన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి