iDreamPost

రాత్రి మద్యం షాపు మూసి.. తెల్లారే తెరిచి చూసి కళ్లు తేలేసిన యజమాని

ఇంట్లో రూపాయలు ఉండటం లేదనుకున్నారో.. బ్యాంకుకు భద్రత పెరిగిందనుకున్నారో తెలియదు కానీ దొంగలు స్టైల్ మార్చారు. ఈ సారి ఏకంగా మద్యం షాపుకే..

ఇంట్లో రూపాయలు ఉండటం లేదనుకున్నారో.. బ్యాంకుకు భద్రత పెరిగిందనుకున్నారో తెలియదు కానీ దొంగలు స్టైల్ మార్చారు. ఈ సారి ఏకంగా మద్యం షాపుకే..

రాత్రి మద్యం షాపు మూసి.. తెల్లారే తెరిచి చూసి కళ్లు తేలేసిన యజమాని

అరవై నాలుగు కళల్లో చోర కళ కూడా ఒకటి. చాలా కళలు అంతరించిపోతున్నాయి కానీ.. ఈ ఆర్ట్ మాత్రం నిలకడగానే కొనసాగుతూ ఉంది. దొంగల సాంప్రదాయ వృత్తిగా మారిపోయింది. అలాగే దోచుకునేందుకు ఏదీ కాదు అనర్హం అని నిరూపిస్తున్నారు దొంగలు. గుండు సూది నుండి సెల్ ఫోన్ టవర్ల వరకు మడతపెట్టి మరీ దోచేస్తున్నారు. ఏదీ లాభసాటిగా తమకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుందో వాటిని కొల్లగొడుతున్నారు. రైలు పట్టాలు, భోగీలు, నడి రోడ్డుపై తిరిగే బస్సులను కూడా చాక చక్యంగా దొంగిలించేస్తున్నారు. ఇల్లు, బ్యాంకులకు కన్నాలేసే రోజులు పోయాయ్ అనుకున్నారేమో.. ఈ సారి ఏకంగా ఓ వైను షాపుకే ఎసరు పెట్టేశారు. దీంతో ఆషాపు యజమాని లబోదిబోమంటున్నాడు.

రాత్రి చక్కంగా బారు షాపు సర్ది వెళ్లిన యజయాని.. పొద్దున్న దుకాణం తెరుద్దామని వెళ్లి చూసే సరికి కళ్లు తేలేశాడు.  లోపల సరుకు ఖాళీ చేసేశారు దొంగలు. ఓరీ భగవంతుడా అని నెత్తిన చేయి వేసుకుని.. తల ఎత్తి పైకి చూసే సరికి సిమెంట్ రేకులు తొలి ఉండటాన్ని గమనించి.. దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మద్యం షాపునే లూఠీ చేసిన ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణాపూర్‌లోని బీజోన్ ఏరియాలో ఉన్న పెద్దమ్మతల్లి వైన్స్ పేరుతో షాపు నడుపుతున్నాడు ఓ వ్యక్తి. సోమవారం రాత్రి మద్యం షాపు మూసేసి ఇంటికి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం..దుకాణం తెరిచేందుకు వెళ్లాడు.

షాపు ఓపెన్ చేసి చూడగా.. సీసాలు కనిపించలేదు.  గల్లా పెట్టిలో డబ్బులు కూడా కనిపించడం లేదు. పై కప్పు మీదున్న సిమెంట్ రేకులు తొలిగి ఉండటం చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. మందమర్రి పోలీసులు వచ్చి.. సిమెంట్ రేకులు తొలగించి మద్యం బాటిల్స్ తీసుకెళ్లినట్లు గుర్తించారు. షాపులో సుమారు రూ. 40 వేల నగదులో పాటు 20 వేల రూపాయల విలువ చేసే మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు దొంగలు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. క్లూస్ టీం రప్పించి.. ఆధారాలు సేకరించారు. షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.  ఈ తరహా దొంగతనం జరగడంతో చూసేందుకు వచ్చారు అక్కడి జనం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి