iDreamPost

అయ్యో భగవంతుడా.. పెళ్లైన ఆరేళ్లకు భార్య సొంత చెల్లని తేలింది..

Man Married Sister: పెళ్లి అనేది అందమైన బంధం. కొన్నిసార్లు కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఆ బంధం ఒక పీడకలలా మారిపోతుంది.

Man Married Sister: పెళ్లి అనేది అందమైన బంధం. కొన్నిసార్లు కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఆ బంధం ఒక పీడకలలా మారిపోతుంది.

అయ్యో భగవంతుడా.. పెళ్లైన ఆరేళ్లకు భార్య సొంత చెల్లని తేలింది..

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. ఇదే మాటను విదేశీయులు కూడా నమ్ముతారు. వాళ్లు కూడా మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ అంటారు. అయితే స్వర్గంలో జరిగిన అన్ని పెళ్లిళ్లు భూమి మీద నిలబడతాయి అని చెప్పడానికి గ్యారెంటీ లేదు. అలాగే హెవెన్ లో చేసిన పెళ్లిళ్లు అన్నీ కరెక్ట్ అనడానికి కూడా లేదు. అలా సరిగ్గా జరగని ఒక పెళ్లి ఆ కటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఈ పెళ్లి గురించి తెలిశాక.. దానిని ఊహించుకోవడం కూడా ఎంతో కష్టంగా ఉంది. విషయం ఏంటంటే.. కట్టుకున్న భార్య తోడబుట్టిన చెల్లి అని తెలిసింది.

సాధారణంగా పెళ్లి అనగానే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూస్తారు. అదే విదేశాల్లో అయితే డేటింగ్ చేసి కొన్నాళ్లు కలిసి జీవించి మ్యాచ్ అవుతారు అనుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటారు. అలాగే ఒక జంట కూడా ఒకరికి ఒకరు దగ్గరయ్యారు. ఆ తర్వాత వాళ్ల మధ్య ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకున్నారు. చక్కని కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సంతోషంగా జీవిస్తున్నారు కూడా. అలా వాళ్లు పెళ్లి చేసుకుని చూస్తుండగానే ఆరేళ్లు గడిచిపోయింది. అప్పుడు వారి జీవితంలో అనుకోని సంఘటన జరిగింది. భార్యకు కిడ్నీ సమస్య తలెత్తింది. ఆమె రెండు కిడ్నీలు పనిచేయడం మానేశాయి. ఎలాగైనా భార్యను దక్కించుకోవాలని కిడ్నీ దాతల కోసం వెతుకలాట మొదలు పెట్టాడు. తన బంధువులు అందరినీ అడిగాడు. కానీ, ఎక్కడా ఫలితం లభించలేదు.

తన కిడ్నీ మ్యాచ్ అవ్వదని తెలుసు.. కానీ, ఆఖరి ప్రయత్నంగా తన కిడ్నీ ఇచ్చేందుకు వైద్యులను సంప్రదించాడు. అందుకు కావాల్సిన పరీక్షలు కూడ చేయించుకున్నాడు. అయితే వైద్యుల నుంచి వచ్చిన కాల్ వినగానే అతనికి కాసేపు ఏం అర్థం కాలేదు. తన కిడ్నీ బార్యకు మ్యాచ్ అవుతోంది అని డాక్టర్స్ నిర్ధారించారు. ఆ వార్త విన్న తర్వాత ఎంతో ఆశ్చర్యానికి లోనైన విషయాన్ని వెల్లడించాడు. ఆ తర్వాత వైద్యులు హెచ్ఎల్ఏ టెస్టు కూడా చేయించుకోవాలని సూచించారు. ఆ టెస్టులో జన్యు పరంగా ఇద్దరి మధ్య ఉన్న పోలిక తెలుస్తుంది. ఈ టెస్టు రిపోర్ట్ వచ్చిన తర్వాత అతనికి నోట మాట రాలేదు. అతనికి అతని భార్యకు జన్యు పరంగా చాలా దగ్గర పోలికలకు ఉన్నాయి. ఆ టెస్టు ఫలితాల్లో తల్లిదండ్రులతో పిల్లలకు కనీసం 50 శాతం వరకు పోలిక ఉంటుంది. అదే తోడబుట్టిన వాళ్లైతే 0 నుంచి 100 శాతం వరకు డీఎన్ఏ మ్యాచ్ అవుతుంది.

వీళ్లిద్దరి టెస్ట్ రిజల్ట్ తోబుట్టువులకు ఉన్నట్లు జన్యుపరంగా చాలా దగ్గర పోలిక ఉంది. అప్పుడే అసలు ప్రశ్నలు మొదలయ్యాయి. భర్తకు తన బయోలాజికల్ పేరెంట్స్ ఎవరో తెలియదు. అతడిని వేరే వాళ్లు దత్తత తీసుకున్నారు. ఈ మొత్తం విషయాన్ని రెడిట్ అనే చర్చా వేదికలో చెప్పుకొచ్చాడు. ఈ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తన పరిస్థితి చూసిన నెటిజన్స్ అతడిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ ఊహ కూడా ఎంతో దారుణంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ భూమి మీద ఏ మనిషికి రాకూడని కష్టం ఈ భర్తకు వచ్చిందంటూ చెప్తున్నారు. ఏదో బీరకాయ పీసు సంబంధం ఉన్న వాళ్లని పెళ్లి చేసుకుంటే ఏదో ఒకటి చెప్పుకుని సర్దుకోవచ్చు. కానీ, తోడబుట్టిన చెల్లిని పెళ్లాడి.. ఆమెతో కలిసి ఉండటం అంటే అతని కష్టం పగవాడికి కూడా రాకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ భర్త/అన్న పరిస్థితిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి