iDreamPost

రికార్డు కోసం 7 రోజులు ఏకథాటిగా ఏడ్చాడు.. పాపం చివరకు..

రికార్డు కోసం 7 రోజులు ఏకథాటిగా ఏడ్చాడు.. పాపం చివరకు..

అతి సర్వత్రా వర్జయేత్‌ అంటారు. అతిగా ఏది చేసినా అది చివరకు నష్టమే చేస్తుంది. తియ్యగా ఉంది కదా అని తీపి వస్తువులు అతిగా తింటే లేని పోని రోగాలు వచ్చినట్లు.. హద్దులు దాటినపుడు ప్రతీది మనలి బాధిస్తుంది. ఇది తెలిసి కూడా కొంతమంది పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రికార్డుల్లోకి ఎక్కాలనుకునే వారు.. ప్రాణాలకు తెగిస్తూ ఉంటారు. రికార్డుల కోసం చేసే పనులు ఒక్కోసారి ప్రాణాలు తీయటమో.. లేదా అవిటి తనాన్ని తీసుకు రావటమో జరుగుతూ ఉంటుంది.

తాజాగా, ఓ వ్యక్తి గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లోకి ఎక్కాలన్న తపనతో 7 రోజులు ఏకథాటిగా ఏడ్చాడు. రికార్డులు ఏమో కానీ.. అతడి కంటి చూపు పోయి కొన్ని నిమిషాల పాటు గుడ్డి వాడిగా మారాడు. ఈ సంఘటన నైజీరియాలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. నైజీరియాకు చెందిన టెంబు ఈబెరె అనే వ్యక్తికి గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కాలన్నది ఆశయం. ఇందుకోసం ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచించాడు. చివరకు ఎక్కువ రోజులు ఏడ్చి గిన్నిస్‌ రికార్డులోకి ఎక్కొచ్చని అతడికి తెలిసింది. దీంతో రికార్డుల పని పట్టే పనిలో పడ్డాడు.

దాదాపు ఏడు రోజులు ఏకథాటిగా ఏడ్వటం మొదలుపెట్టాడు. ఏడు రోజులు గడిచాయి. ఎడ తెరపి లేకుండా ఏడవటం వల్ల అతడి కళ్లు బాగా ఉబ్బిపోయాయి. తల నొప్పి వచ్చింది. దాదాపు 45 నిమిషాల పాటు కంటిచూపు కోల్పోయాడు. రికార్డు సంగతి ఏమో కానీ, కళ్లు కనిపించకుండా పోయే సరికి అతడి దిమ్మ తిరిగిపోయింది. అయితే, 45 నిమిషాల తర్వాత కంటి చూపు మళ్లీ వచ్చింది. దీంతో ఊపిరి పీల్చుకున్నాడు. కంటి చూపుతో పాటు రికార్డు కూడా అతడి సొంతం అయింది. దీంతో ఫుల్‌ ఖుషీ అయ్యాడు. మరి, రికార్డు కోసం కంటి చూపును పణంగా పెట్టిన ఈ నైజీరియా వ్యక్తిపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి