iDreamPost

కంటి వ్యాధులను కన్నీళ్ళు పసిగడతాయి..!!

కంటి వ్యాధులను కన్నీళ్ళు పసిగడతాయి..!!

మనకు పట్టరాని సంతోషమొస్తే ఆనందబాష్పాలు వస్తాయి. మనకు ఏదైనా చెప్పుకోలేని, భరించలేని కష్టమొస్తే కన్నీళ్ళొస్తాయి. మరి కళ్ళకే ఏదైనా కష్టమొస్తే?? కనీళ్ళు ఆ వ్యాధుల్ని పసిగడతాయా?? అవును.. మీ కన్నీళ్ళతో నేత్ర వ్యాధుల్ని తెలుసుకునే విధానాన్ని కనుగొన్నారు చైనా పరిశోధకులు.

ఈ కొత్త విధానానికి “ఐ టియర్స్” గా నామకరణం చేశారు. సాధారణంగా లక్షణాలను బట్టి వైద్యులు నేత్ర వ్యాధులను గుర్తిస్తూ ఉంటారు. అయితే వ్యాధుల ప్రారంభ దశలో కచ్చితమైన నిర్థారణకు వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రోటీన్లు, జన్యువుల నమూనాలను పరీక్ష చేస్తారు. కానీ ఇలాంటి వాటికోసం ఎక్కువ సమయమే పడుతోంది.

అయితే తాజా విధానంతో మన కన్నీటి నుంచి ఎక్సో జోమ్స్ ను సేకరిం చే నానోపొర వ్యవస్థను  అభివృద్ధి చేశారు. కన్నీటి ద్వారా ఈ సమస్యను అధిగమించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఐ టియర్స్ తో కన్నీటి నమూనాలను వడకట్టి కేవలం 5 నిమిషాల్లోనే ఎక్సోజోమ్ లను అందిస్తోందని అన్నారు. వీటిని మరికాస్త పరిశీలన జోడించిన అనంతరం రోగులు, ఆరోగ్యవంతుల మధ్య తేడాను గమనించడంతో పాటు వివిధ కంటి రోగాలను సైతం గుర్తించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి