iDreamPost

Bramayugam: భ్రమయుగం ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. మరోసారి సత్తా చాటిన మమ్ముట్టి

  • Published Feb 17, 2024 | 11:19 AMUpdated Feb 17, 2024 | 11:25 AM

భ్రమయుగం సినిమాతో మరోసారి తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు మమ్ముట్టి. ఫస్ట్‌ డే స్ట్రాంగ్‌ కలెక్షన్స్‌ సాధించింది భ్రమయుగం..

భ్రమయుగం సినిమాతో మరోసారి తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు మమ్ముట్టి. ఫస్ట్‌ డే స్ట్రాంగ్‌ కలెక్షన్స్‌ సాధించింది భ్రమయుగం..

  • Published Feb 17, 2024 | 11:19 AMUpdated Feb 17, 2024 | 11:25 AM
Bramayugam: భ్రమయుగం ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. మరోసారి సత్తా చాటిన మమ్ముట్టి

సరికొత్త కథ, భిన్నమైన పాత్రలు చేయాలంటే మమ్ముట్టి తర్వాతే ఎవరైనా. కథ, పాత్ర నచ్చిందా.. గే క్యారెక్టర్‌ చేయడానికి కూడా వెనకాడడు. తనకు కావాల్సింది మంచి సినిమా.. తనలోని నటుడుని సంతృప్తి పరిచే క్యారెక్టర్‌ వస్తే.. ఇక ఏం ఆలోచించడు. తన నట విశ్వరూపం చూపిస్తాడు. తాజాగా మమ్ముట్టి ప్రధాన పాత్రలో వచ్చిన భ్రమయుగం సినిమా కూడా ఇదే కోవకు చెందినదే. నేటి కాలంలో సినిమా మేకింగ్‌ అంటే అత్యాధునిక టెక్నాలజీ, గ్రాఫిక్స్‌ కచ్చితం అన్నట్లుగా మారింది పరిస్థితి. కానీ భ్రమయుగం సినిమాలో అవేం లేకుండా దేశంలో ఏ స్టార్‌ హీరో చేయని ప్రయోగం చేశాడు మాలీవుడ్‌ మెగాస్టార్‌ మమ్ముట్టి.

భ్రమయుగం సినిమాలో మూడే మూడు పాత్రలతో, బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాంబినేషన్‌లో మమ్ముట్టి రగ్గడ్‌ లుక్‌లో కనిపించి ప్రేక్షకులను మాయ చేశాడు. గురువారం అనగా ఫిబ్రవరి 15న విడుదలైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మమ్ముట్టికి మరో సారి నేషనల్‌ అవార్డ్‌ పక్కా అంటున్నారు ఈ సినిమా చూసిన ప్రేక్షకులు.

భూతకాలం సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్‌ సదాశివన్‌.. భ్రమయుగం సినిమాకు డైరెక్టర్‌. తెలుగులో తప్ప మిగతా భాషల్లో విడుదలైన ఈ సినిమా.. పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకోవడమే కాక.. కలెక్షన్ల విషయంలో కూడా దూసుకుపోతుంది. ఇక కేరళ బాక్సాఫీస్‌ వద్ద భ్రమయుగం 3 కోట్ల రూపాయల గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించింది. గల్ఫ్‌ దేశాల్లోనూ సత్తా చాటుతోంది. అక్కడ ఏకంగా తొలి రోజు 3.3 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసింది. ఇక మొత్తంగా చూసుకుంటే ఫస్ట్‌ డేనే భ్రమ యుగం రూ. 7.6 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించింది.

తెలుగులో కూడా రిలీజ్‌ చేసి ఉంటే కలెక్షన్స్‌ మరింత పెరిగేవి అంటున్నారు. రానున్న రోజుల్లో ఈ సినిమా వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక మూవీలో మమ్ముట్టితో పాటు అర్జున్‌ అకోశక్‌, సిద్ధార్థ్‌ భరతన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. కేవలం మూడు పాత్రలతో.. రెండున్నర గంటలపాటు ప్రేక్షకులను థియేటర్‌లో కూర్చిలో నుంచి లేవకుండా కట్టి పడేయడంలో దర్శకుడు పూర్తిగా విజయం సాధించడని అంటున్నారు. అసలు మమ్ముట్టి ఇలాంటి పాత్రను ఓకే చేయడంతోనే సినిమా విజయం ఖారరైందని.. ఈ వయసులో కూడా మమ్ముట్టి ఇలాంటి వెరైటీ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులు ముందుకు రావడం నిజంగా ‍గ్రేట్‌ అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి