iDreamPost

Maldives: మాల్దీవ్స్‌ ప్రధాని ముయిజ్జు బ్యాగ్రౌండ్! ఇండియాపై ఇంత ద్వేషం దేనికి?

  • Published Jan 30, 2024 | 4:03 PMUpdated Jan 30, 2024 | 4:03 PM

Mohamed Muizzu: మాల్దీవ్స్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు పేరు వార్తల్లో ప్రముఖంగా కనిపిస్తోంది. ఇంతకీ ఎవరీ ముయిజ్జు.. భారత్‌పై అతడికి ఇంత ద్వేషం ఎందుకు అంటే..

Mohamed Muizzu: మాల్దీవ్స్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు పేరు వార్తల్లో ప్రముఖంగా కనిపిస్తోంది. ఇంతకీ ఎవరీ ముయిజ్జు.. భారత్‌పై అతడికి ఇంత ద్వేషం ఎందుకు అంటే..

  • Published Jan 30, 2024 | 4:03 PMUpdated Jan 30, 2024 | 4:03 PM
Maldives: మాల్దీవ్స్‌ ప్రధాని ముయిజ్జు బ్యాగ్రౌండ్! ఇండియాపై ఇంత ద్వేషం దేనికి?

ప్రస్తుతం మన దేశంలోనేకాక విదేశీ మీడియాలో కూడా ఎక్కువగా వినిపిస్తోన్న పేరు మాల్దీవ్స్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు. నేడు అతడిపై మాల్దీవ్స్‌ పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు మాల్దీవ్స్‌ ప్రధాన ప్రతిపక్షం మాల్దీవియన్‌ డెమోక్రాటిక్‌ పార్టీ సిద్ధం అవుతోంది. ఈమేరకు అవసరమైన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ముగించింది. ఇంతకు ఈ అవిశ్వాస తీర్మానం ఎందుకు అంటే.. రెండు రోజుల క్రితం అనగా ఆదివారం నాడు మాల్దీవ్స్‌ అధ్యక్షుడు ముయిజ్జు తన కేబినెట్‌లోకి నలుగురు మంత్రులను చేర్చుకునే అంశంపై జరిపిన ఓటింగ్‌ కాస్త.. అధికార, విపక్ష ఎంపీలు కొట్టుకునే పరిస్థితి తీసుకువచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు ఎంపీలకు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో.. ప్రపంచ వేదిక మీద మాల్దీవ్స్‌ పరువు పోయింది.

మోదీ లక్షద్వీప్‌ పర్యటన నాటి నుంచి మాల్దీవ్స్‌ పేరు వార్తల్లో ప్రముఖంగా కనిపిస్తోంది. ఇండియాకు పొరుగుదేశమైన మాల్దీవ్స్‌తో మొన్నటి వరకు కూడా మనకు సంత్సంబంధాలే ఉన్నాయి. దౌత్యపరంగా చూసుకున్నా మాల్దీవ్స్‌ ఇండియాకు ఎంతో ముఖ్యం. అందుకే ఏళ్లతరబడి ఆ దేశంతో మనకు స్నేహ సంబంధాలే ఉన్నాయి.

కానీ తాజాగా తెరమీదకు వచ్చిన లక్షద్వీప్‌ వివాదాన్ని ఆసరా చేసుకుని మాల్దీవ్స్‌.. ఇండియాకు దూరం జరిగే ప్రయత్నాలు చేస్తోంది. గతేడాది నవంబర్‌లో మాల్దీవ్స్‌లో జరిగిన ఎన్నికల్లో మహమ్మద్‌ ముయిజ్జు విజయం సాధించి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భారత్‌ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వస్తున్నాడు. ఇండియా ఔట్‌ నినాదంతోనే ముయిజ్జు పార్టీ గతేడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది.

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. భారత వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ వస్తున్నాడు ముయిజ్జు. ఈ క్రమంలోనే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే భారత సైన్యాన్ని తమ దేశం నుంచి ఉపసంహరించుకోవాలని కోరాడు. మన దేశం బహుమతిగా ఇచ్చిన రెండు అధునాతన ధ్రువ హెలికాప్టర్లను వెనక్కి తీసుకోవాలని సూచించాడు.

Maldives president life story

భారత్‌ను దూరం పెడుతున్న ముయిజ్జు డ్రాగన్‌ దేశం చైనాకు చేరువయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడు. పైగా గత కొంత కాలం నుంచి మాల్దీవ్స్‌ చైనా నుంచి భారీ ఎత్తున్న రుణాలు తీసుకుంది. చైనా ఒత్తిడి వల్లే మాల్దీవ్స్‌ ఇండియాకు వ్యతిరేకంగా పని చేస్తోందని జగమెరిగిన సత్యం. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారత్‌ వ్యతిరేక విధానలతో వెళ్తోన్న ముయిజ్జు.. తన వైఖరి కారణంగా ఇప్పుడు పదవిని కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ముయిజ్జు గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు జనాలు. ఆ వివరాలు..

బాల్యం, విద్యాభ్యాసం..

మహమ్మద్‌ ముయిజ్జు.. 1978 సంవత్సంలో మాలే, మాల్దీవుల్లో జన్మించాడు. మజీదియా స్కూల్లో చదువు పూర్తి చేశాడు. లండన్‌ యూనివర్శిటీ నుంచి స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌, మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత లీడ్స్‌ విశ్వవిద్యాలయం నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ పొందాడు. అమెరికా ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ప్రాజెక్ట్‌ మేనేమెంట్‌ ప్రొఫెషనల్‌ సర్టిఫికేషన్‌ కూడా పొందాడు. ఆ తర్వాత అనేక ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేశాడు.

రాజకీయ జీవితం..

ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ముందుగా 2012లో మహ్మద్‌ వహీద్‌ హసన్‌ అధ్యక్షతలోని అధాలత్‌ పార్టీలో సభ్యుడిగా చేరాడు. 2013 ఎన్నికల్లో విజయం సాధించి.. సంకీర్ణ ప్రభుత్వమైన మాల్దీవ్స్‌ డెవలప్‌మెంట్‌ అలయన్స్‌(ఎండీఏ)లో సభ్యుడుగా ఉన్నాడు. ఆ సమయంలో హౌసింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆ సమయంలో మాల్దీవ్స్‌లో ఎంతో ప్రఖ్యాతి గాంచిన సినమాలే వంతెన సహా అనేక నిర్మాణాలు చేపట్టాడు.

2018 ఎన్నికల తర్వాత.. ముయిజ్జు ఎండీఏను విడిచిపెట్టి.. ప్రోగ్రెసివ్‌ పార్టీ ఆఫ్‌ మాల్దీవ్స్‌లో చేరాడు. 2021 మేయర్‌ ఎన్నికల్లో మాలే మేయర్‌గా ఎన్నుకొబడ్డాడు. ప్రజలచే ఎన్నకోబడ్డ మొదటి మాలే మేయర్‌గా ముయిజ్జు రికార్డు క్రియేట్‌ చేశాడు. 2023, నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో మాల్దీవ్స్‌ అధ్యక్షుడిగా విజయం సాధించాడు. నవంబర్‌ 17న కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. భారత్‌పై అక్కసు కారణంగా పదవీ గండం తెచ్చుకున్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి