iDreamPost

ఇండస్ట్రీని ఏలిన దర్శకుడు.. ఎవ్వరూ చూసుకోక వృద్ధాశ్రమంలో..

ఇండస్ట్రీని ఏలిన దర్శకుడు.. ఎవ్వరూ చూసుకోక వృద్ధాశ్రమంలో..

భారత చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ తమిళ హీరో విజయ్‌ ఆంటోనీ కూతురు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మానసిక ఒత్తిడి కారణంగా ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటర్‌ చదువుతున్న ఆ అమ్మాయి అలా ఆత్మహత్య చేసుకోవటం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. చిత్ర పరిశ్రమ ఈ విషాదం నుంచి తేరుకునే లోపే మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్‌ మలయాళ దర్శకుడు కే జార్జ్‌ కన్నుమూశారు.

7 7 ఏళ్ల వయసులో ఆయన వృద్ధాశ్రమంలో తుది శ్వాస విడిచారు. వివరాల్లోకి వెళితే.. జార్జ్‌ పూర్తి పేరు కులకట్టిల్‌ గీవర్గీస్‌ జార్జ్‌. ఆయన కేరళలోని తిరువల్లలో జన్మించారు. జార్జ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. రాము కరియత్‌ దగ్గర పని చేశారు. 1975లో వచ్చిన ‘స్వప్నపదం’ సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. కొలంగల్‌, లేక్యుడే మరణం ఒరు ఫ్లాష్‌బ్యాక్‌, మట్టోరల్‌ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అప్పుడు ఆయన తీసిన సినిమాలు భవిష్యత్తు సినిమా దర్శకులకు ఎంతో స్పూర్తిగా నిలుస్తున్నాయి. అలాంటి ఆయన తనకు ఎవరూ లేక.. గత కొన్నేళ్ల నుంచి వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. గత కొన్ని రోజులనుంచి ఆయన వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా, కన్నుమూశారు. జార్జ్‌ మృతిపై పలువురు సినీ ప్రముఖుల తమ సంతాపం తెలిపారు. మరి, ఇండస్ట్రీలో చోటుచేసుకుంటున్న వరుస విషాదాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి