iDreamPost

మలయాళ ఇండస్ట్రీని కుమ్మేసిన ‘మంజుమ్మెల్ బాయ్స్’.. తెలుగులో అప్పుడే!

  • Published Mar 04, 2024 | 10:29 AMUpdated Mar 07, 2024 | 6:17 PM

Manjummel Boys Telugu Version Release Date: తెలుగులో సందడి చేసేందుకు మరో మలయాళ బ్లాక్​బస్టర్ వచ్చేస్తోంది. ఈ సూపర్ సర్వైవల్ థ్రిల్లర్​ను చూడాలంటే ప్రతి క్షణం ఊపిరి బిగపట్టాల్సిందే.

Manjummel Boys Telugu Version Release Date: తెలుగులో సందడి చేసేందుకు మరో మలయాళ బ్లాక్​బస్టర్ వచ్చేస్తోంది. ఈ సూపర్ సర్వైవల్ థ్రిల్లర్​ను చూడాలంటే ప్రతి క్షణం ఊపిరి బిగపట్టాల్సిందే.

  • Published Mar 04, 2024 | 10:29 AMUpdated Mar 07, 2024 | 6:17 PM
మలయాళ ఇండస్ట్రీని కుమ్మేసిన ‘మంజుమ్మెల్ బాయ్స్’.. తెలుగులో అప్పుడే!

ప్రస్తుతం మలయాళ ఫిల్మ్ ఇండ​స్ట్రీ ఫుల్ జోష్​లో ఉంది. ఒకే నెలలో వరుస బ్లాక్​బస్టర్​లు రావడంతో మాలీవుడ్ ఆడియెన్స్​ సంతోషంలో మునిగిపోయారు. ‘ప్రేమలు’, ‘భ్రమయుగం’ లాంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన మలయాళ చిత్ర పరిశ్రమ.. తాజాగా మరో సూపర్​హిట్​ను అందుకుంది. గత నెలలో విడుదలైన ‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమా తిరుగులేని విజయాన్ని అందుకుంది. సర్వైవల్ థ్రిల్లర్ కాన్సెప్ట్​తో రూపొందిన ఈ ఫిల్మ్ ఫిబ్రవరి 22న రిలీజై పాజిటివ్ టాక్​తో దూసుకుపోతోంది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ వరల్డ్​వైడ్​గా ఇప్పటికే రూ.55 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అలాంటి ఈ మూవీ ఇప్పుడు తెలుగులోకి రానుంది.

‘మంజుమ్మెల్ బాయ్స్’ తెలుగు వెర్షన్​ను మార్చి 15వ తేదీన ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫిల్మ్​కు సంబంధించిన డబ్బింగ్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. చిదంబర్ పీ పొదువల్ డైరెక్షన్​లో వచ్చిన ఈ సినిమాలో శోభున్ షాహిర్​తో పాటు శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, జూనియర్ లాల్, గణపతి ఎస్, అరుణ్​, అభిరామ్, దీపక్ తదితరులు ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేశారు. 2006లో తమిళనాడు కొడైకెనాల్​లోని గుణ గుహల్లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ‘మంజుమ్మెల్ బాయ్స్’ చిత్రాన్ని తెరకెక్కించారు. కొందరు స్నేహితులు కలసి గుణ గుహల్ని సందర్శించడానికి వెళ్లగా.. అందులో ఒకరు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోతాడు. దీంతో అతడ్ని కాపాడేందుకు అతడి ఫ్రెండ్స్ చేసిన రెస్క్యూనే ఈ ఫిల్మ్ స్టోరీ.

గుణ గుహల్లో తప్పిపోయిన స్నేహితుడి కోసం అతడి ఫ్రెండ్స్ కలసి చేసిన రెస్క్యూ ఘటన అప్పట్లో సంచలన సృష్టించింది. ఒక దశలో పోలీసులు కూడా చేతులెత్తేసినా.. తమ మిత్రుడ్ని రక్షించేందుకు ఆ గ్యాంగ్ విశ్వప్రయత్నం చేస్తుంది. అతడు ఎలా బయటకు వచ్చాడనేది స్క్రీన్ మీద చూస్తేనే కిక్కు. వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా రావడంతో ఆడియెన్స్​ కాసుల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు తెలుగులోనూ సందడి చేసేందుకు రెడీ అయింది ‘మంజుమ్మెల్ బాయ్స్’. కేరళతో పాటు తమిళనాట కూడా ఈ ఫిల్మ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీంతో తెలుగు వెర్షన్ మీద కూడా అంచనాలు పెరిగిపోయాయి. మలయాళ చిత్రాలకు పెరిగిన డిమాండ్ దృష్ట్యా ఈ సినిమా తెలుగు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి.. ‘మంజుమ్మెల్ బాయ్స్’ తెలుగు రిలీజ్ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: OTTలోకి ఊరు పేరు భైరవకోన.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి