iDreamPost

తమిళ అమ్మ కథకు అసలు ఛాలెంజ్

తమిళ అమ్మ కథకు అసలు ఛాలెంజ్

రేపు మన దృష్టంతా గోపిచంద్ సీటిమార్, నాని టక్ జగదీష్ ల మీదే ఉంది కానీ కంగనా రౌనత్ టైటిల్ రోల్ పోషించిన తలైవి కూడా రేస్ లో ఉంది. అయితే దీనికి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన బజ్ లేకపోవడం నిర్మాతలను టెన్షన్ పెడుతోంది. మాజీ నటి కం తమిళనాడు సిఎం కీర్తిశేషులు జయలలిత జీవిత కథను ఆధారంగా రూపొందించిన ఈ సినిమా ఇటీవలే కొందరు ఇండస్ట్రీ పెద్దలకు, బాలీవుడ్ లోని మీడియా ప్రముఖులకు ప్రీమియర్ షోలు వేశారు. రిపోర్ట్స్ ఫుల్ పాజిటివ్ గా వచ్చాయి. కేవలం వీటిని ఆధారంగా చేసుకుని జనం ఎగబడి వచ్చేంత సీన్ ఉందా అంటే అనుమానమే. బుకింగ్స్ చూస్తే అది తేటతెల్లమైపోతుంది

దీనికి కారణం జయలలిత ప్రస్థానం మీద అరవ ఆడియన్స్ కు ఉన్నంత ఆసక్తి మనకు లేకపోవడం. దానికి తోడు పోటీ సినిమాలు క్లాసు మాస్ ఇద్దరినీ ఆకట్టుకునేలా టెంప్ట్ చేస్తూ ఉండటం. అందుకే తలైవి ఓ రెండు మూడు షోలు అయ్యాక పబ్లిక్ టాక్ ప్లస్ రివ్యూలను బట్టి ఏదైనా పికప్ కావడం కాకపోవడం ఆధారపడి ఉంటుంది. ఆ మధ్య రమ్యకృష్ణ ఇదే పాత్రను క్వీన్ అనే వెబ్ సిరీస్ లో చేయడం అందరికీ గుర్తే. దాన్ని మళ్ళీ ఓ టీవీ ఛానల్ లో సీరియల్ గా కూడా టెలికాస్ట్ చేశారు. రెస్పాన్స్ బాగానే వచ్చింది. మళ్ళీ అదే కథను వెండితెర మీద చూడాలంటె దాంట్లో లేని డ్రామా, భారీతనం తలైవిలో ఉండాలి. అది రేపు తేలనుంది.

తెలుగులో డబ్బింగ్ వెర్షనే అయినప్పటికీ కనీసం మన ఆడియన్స్ కోసం టైటిల్ మార్చినా బాగుండేది. కానీ ఎందుకో మరి నిర్మాతలు ఆ పని చేయలేకపోయారు. సో తలైవి ఇప్పుడు సీటిమార్, టక్ జగదీష్ పోటీని తట్టుకుంటూనే బాగుందనే టాక్ తెచ్చుకోవాలి. రెండు వారాలకే ఓటిటికి హిందీ వెర్షన్ ఇవ్వడం గురించి చాలా మల్టీ ప్లెక్సులు ఈ సినిమా వేసేందుకు విముఖత చూపించాయి. ఓ ఇంటర్వ్యూలో కంగనా దీన్ని ఖండించింది కూడా. మరి ఇంత కాంపిటీషన్, సవాళ్ల మధ్య తలైవి ఏం చేయబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. హీరోయిన్ తో సమానంగా ఎంజిఆర్ పాత్ర పోషించిన అరవింద్ స్వామి జనాన్ని ఆకర్షిస్తూ ఉండటం విశేషం

Also Read: అంచనాలు పెంచేసిన గబ్బర్ సింగ్ కాంబో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి