iDreamPost

జక్కన్న హింట్ తో ఇండియానా జోన్స్ చూస్తున్న మహేష్ ఫాన్స్!

  • Published Jan 25, 2024 | 3:43 PMUpdated Jan 25, 2024 | 3:43 PM

సూపర్ స్టార్ మహెశ్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో త్వరలోనే కొత్త సినిమా తెరకెక్కనుందని ఎప్పటి నుంచే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా అయితే తాజాగా మహెష్ ఎస్ఎస్ఎంబి 29గా తెరకెక్కునున్న సినిమా పై లేటస్ట్ ఆప్ డేట్స్ అందింది. ఇంతకి అదేమిటంటే..

సూపర్ స్టార్ మహెశ్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో త్వరలోనే కొత్త సినిమా తెరకెక్కనుందని ఎప్పటి నుంచే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా అయితే తాజాగా మహెష్ ఎస్ఎస్ఎంబి 29గా తెరకెక్కునున్న సినిమా పై లేటస్ట్ ఆప్ డేట్స్ అందింది. ఇంతకి అదేమిటంటే..

  • Published Jan 25, 2024 | 3:43 PMUpdated Jan 25, 2024 | 3:43 PM
జక్కన్న హింట్ తో ఇండియానా జోన్స్ చూస్తున్న మహేష్ ఫాన్స్!

సూపర్ స్టార్ మహెశ్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘గుంటూర్ కారం’. మాస్ యాక్షన్ గా రూపొందించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ సంక్రాతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదైన సంగతి తెలిసిందే. ఇక మూవీలో మహేష్ ని ఊర మాస్ వెంకటరమణగా దర్శకుడు త్రివ్రికమ్ చూపించారు. దీంతో చాలా రోజులకి మహెశ్ మాస్ లుక్ లో దర్శనమివ్వడంతో… ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. కాగా, గుంటూరు కారం స ినిమాకి మొదట మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొట్టడంతో మహెష్ అభిమానులు చాలా కూడా ఆనంద పడ్డారు. ఇదిలా ఉంటే.. చాలా రోజుల నుంచిఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తన నెక్ట్స్ మూవీని మహేష్ బాబుతో చేయనున్నారని, త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా రాజమౌళి, మహెష్ ఎస్ఎస్ఎంబి 29గా తెరకెక్కునున్న ప్యాన్ వరల్డ్ మూవీకి సంబంధించి ప్రత్యేక దృష్టి పెడుతున్నారనే వార్త వినిపిస్తుంది. అదేలా అంటే..

ఇండియన్ జోన్స్ లో హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సిరీస్ అనేవి ప్రస్తుతం ట్రెండ్ గా మారింది. ఆ సినిమాలు చూడటానికి ఎంతో స్ఫూర్తిగా ఉంటుందని సినీ ప్రియులు వాటినే ఎక్కువగా చూడటం మొదలుపెట్టారు. అయితే ఇండియాన్ జోన్ లో విడుదలైన మొదటి సినిమా ‘రైడర్స్ అఫ్ ది లాస్ట్ ఆర్క్’ గా 1981లో వచ్చింది. ఆ తర్వాత.. 1989లో ‘టెంపుల్ అఫ్ ది డూమ్’ , 1989లో ‘లాస్ట్ క్రూసేడ్’, 2008లో ‘కింగ్ డం అఫ్ ది క్రిస్టల్ స్కల్’ రిలీజయ్యాయి. ఈ సినిమాలన్ని బ్లాక్ బస్టర్లే. అయితే గత ఏడాది వచ్చిన డయల్ అఫ్ డెస్టినీ ఒక్కటే ఆశించిన అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోలేకపోయింది. ఇవన్నీ అడవులు, గుప్త నిధులు, గుహల్లో రహస్యాలు, వేటలు, కుట్రల నేపథ్యంలో సాగుతాయి. గతంలో బొబ్బిలి రాజా, అంజి లాంటి ఎన్నో సినిమాల్లో వీటి రెఫరెన్సులను చూడొచ్చు. ఇలా ఏళ్ళ తరబడి ఈ ఫ్రాంచైజ్ ని స్ఫూర్తిగా తీసుకున్న ఫిలిం మేకర్స్ ఎందరో చెప్పడం చాలా కష్టం.

కాగా, ఇప్పుడు రాజమౌళి కూడా ఏకంగా ఈ తరహాలో బ్యాక్ డ్రాప్ ని తీసుకుంటున్నరంటే.. అంతగా ఆ మూవీస్ లో ఏముందని మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వాటిని చూడటం మొదలుపెట్టారు. కాగా, అవన్నీ ఇప్పుడు ఓటిటిలో అందుబాటులో ఉన్నవే. ఇక సినిమాల్లో ఎమోషన్ మిస్ కాకుండా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ లో హీరోయిజంని పీక్స్ లో చూపించే రాజమౌళి ఇప్పుడీ అడ్వెంచర్ డ్రామాని ఏ రేంజ్ లో ప్రెజెంట్ చేస్తారో ఊహించుకోవడం కష్టం. ప్రస్తుతానికి ఈ సినిమా బడ్జెట్ వెయ్యి కోట్లని వినిపిస్తోంది. అలాగే ఇంక పెరిగిన ఆశ్యర్యపోవలసిన అవసరం లేదు. ఇక పలు జాతీయ అంతర్జాతీయ నిర్మాణ సంస్థలు కూడా ఇందులో పెట్టుబడి పెడతాయనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. కాగా, దీనిపై ఇంకా అధికారింగా ప్రకటన రాలేదు. మరి, మహెశ్ సినిమా పై రాజామౌళి ఎంపిక చేస్తున్న కథ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి