iDreamPost

Guntur Kaaram OTT: గుంటూరు కారం ఓటీటీ, శాటిలైట్ పార్టనర్ ఫిక్స్.. ఎక్కడ చూడొచ్చంటే?

Guntur Kaaram Streaming Platform & Satellite Rights: థియేటర్లలో గుంటూరు కారం జాతర ప్రారంభం కానుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా గుంటూరు కారం ఓటీటీ, శాటిలైట్ పార్టనర్ ఫిక్స్ అయ్యాయి. ఎందులో చూడొచ్చంటే?

Guntur Kaaram Streaming Platform & Satellite Rights: థియేటర్లలో గుంటూరు కారం జాతర ప్రారంభం కానుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా గుంటూరు కారం ఓటీటీ, శాటిలైట్ పార్టనర్ ఫిక్స్ అయ్యాయి. ఎందులో చూడొచ్చంటే?

Guntur Kaaram OTT: గుంటూరు కారం ఓటీటీ, శాటిలైట్ పార్టనర్ ఫిక్స్.. ఎక్కడ చూడొచ్చంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా మూవీ గుంటూరు కారం. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ ను కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. గుంటూరు కారం మూవీ  శుక్రవారం ధియేటర్లలో సందడి చేసింది.  ఈ నేపథ్యంలో ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్. గుంటూరు కారం విడుదలకు ముందే ఓటీటీ ప్లాట్ ఫామ్ కన్ఫామ్ అయిపోయింది. దీంతో పాటు శాటిలైట్ ఛానల్ కూడా ఫిక్స్ అయ్యింది. ఇంతకీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుందంటే?

గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా శుక్రవారం రిలీజ్ అయ్యింది.  మాస్ యాక్షన్ అంశాలతో తెరకెక్కిన ఈ మూవీపై టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ లుక్, డైలాగ్స్ తో దుమ్మురేపారని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. మొత్తానికి పాజిటీవ్ టాక్ తో త్వరలో బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టేందుకు సిద్ధం అంటున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ నటించిన గుంటూరు కారం డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. పలు ఓటీటీ సంస్థలు పోటీపడ్డప్పటికీ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇక గుంటూరు కారం శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ కొనుగోలు చేసింది.

ఇక ఈ సినిమా నుంచి విడుదలైన మాస్ సాంగ్ కుర్చీ మడత పెట్టి సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆడియెన్స్ లో విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది. సంక్రాంతి పండుగ ముందు  గుంటూరు కారం ఘాటు చూపించిందని అంటున్నారు అభిమానులు. విడుదలకు ముందే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని ఫ్యాన్స్ తో పాటు సినీవర్గాల టాక్. స్టైలిష్ గా, డీసెంట్ గా కనిపించే మహేష్ ఈ సినిమాలో ఊరమాస్ లుక్ లో కనిపించనుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి గుంటూరు కారం సినిమాపై మీ అభిప్రాయానలు కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి