iDreamPost

మహేశ్ ఫ్యాన్స్ మారిపోయారు! ఈసారి గట్టిగా నిలబడ్డారు!

  • Published Jan 19, 2024 | 10:14 AMUpdated Jan 19, 2024 | 1:25 PM

Mahesh Babu - Guntur Kaaram: మహేష్‌ బాబు గుంటూరు కారం సినిమా భారీ కలెక్షన్లు సాధిస్తూ.. దూసుకుపోతుంది. చాలా ప్రాంతాల్లో బ్రేక్‌ ఈవెన్‌ సాధించింది. ఇందుకు కారణం మహేష్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. ఆ వివరాలు..

Mahesh Babu - Guntur Kaaram: మహేష్‌ బాబు గుంటూరు కారం సినిమా భారీ కలెక్షన్లు సాధిస్తూ.. దూసుకుపోతుంది. చాలా ప్రాంతాల్లో బ్రేక్‌ ఈవెన్‌ సాధించింది. ఇందుకు కారణం మహేష్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. ఆ వివరాలు..

  • Published Jan 19, 2024 | 10:14 AMUpdated Jan 19, 2024 | 1:25 PM
మహేశ్ ఫ్యాన్స్ మారిపోయారు! ఈసారి గట్టిగా నిలబడ్డారు!

హీరోలకు ఉండే, ఉండాల్సిన అతి పెద్ద ఆస్తి అభిమానులు. ఫ్యాన్‌ బేస్‌ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే.. ఆ హీరో రేంజ్‌ అంత పెద్దది అని భావిస్తారు. సినిమా యావరేజ్‌ అయినా సరే.. అభిమానులు తల్చుకుంటే ఆ సినిమాను సాలిడ్‌ హిట్‌గా నిలుపుతారు. తాజాగా మహేష్‌ బాబు గుంటూరు కారం సినిమా విషయలో ఇదే విషయం ప్రూఫ్‌ అయ్యింది. సంక్రాంతి పండగ సందర్భంగా మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా విడుదలయ్యింది. జనవరి 12న వచ్చిన ఈ సినిమా ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో నుంచే ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. మహేష్‌ బాబు కెరీర్‌లోనే భారీ డిజాస్టర్‌ అని తేల్చిచెప్పారు. సెకండ్‌ డే నుంచే సినిమా ఎత్తి పోతుంది అని అందరూ భావించారు.

అయితే అనూహ్యంగా గుంటూరు కారం సినిమా భారీ కలెక్షన్లు సాధిస్తూ.. సినిమా ఫ్లాప్‌ అన్న వారికి దిమ్మ తిరిగే షాక్‌ ఇస్తోంది. గుంటూరు, కృష్ణా వంటి ప్రాంతాల్లో ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ సాధించింది అంటున్నారు. ఈ ఎనిమిది రోజుల్లోనే గుంటూరు కారం సినిమా మాగ్జిమం వసూళ్లు రాబట్టిందని చెబుతున్నారు. సెకండ్‌ డే నుంచే సినిమా తీసేస్తారు అని భావించిన వారికి గట్టి షాక్‌ ఇస్తూ.. స్ట్రాంగ్‌గా నిలబడి.. బీభత్సమైన కలెక్షన్లు సాధిస్తూ.. ఇది మహేష్‌ బాబు క్రేజ్‌ అని నిరూపిస్తుంది గుంటూరు కారం సినిమా. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ ఈ సినిమాను ఓన్‌ చేసుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబంతో కలిసి వెళ్లి సినిమా చూస్తూ ఎంజాయ్‌ చేశారు. దాంతో టాక్‌తో సంబంధం లేకుండా గుంటూరు కారం సినిమా విజయం సాధించింది.

guntur kaaram movie safe

అయితే గుంటూరు కారం ఇంత భారీ సక్సెస్‌ సాధించడానికి ప్రధాన కారణం మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ అని చెప్పవచ్చు. అవును సాధారణంగా సినిమాల హిట్టు, ఫ్లాప్‌ విషయంలో అభిమానులు కీలక పాత్ర పోషిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మిగతా హీరోల అభిమానుల సంగతి తెలియదు కానీ.. మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ మాత్రం సినిమా మీద తమ అభిప్రాయాలు చెప్పడంలో చాలా కచ్చితంగా ఉంటారు. నచ్చితే ఓకే.. లేదంటే.. సినిమా చెత్తగా ఉందని వారే చెప్తారు. తమ అభిమాన హీరో ఎందుకు ఇలాంటి పిచ్చి సినిమా తీశాడని డైరెక్ట్‌గా కామెంట్స్‌ చేస్తారు. బయటి వాళ్ల కన్నా ముందు వాళ్లే విమర్శలు చేస్తారు. సినిమా బాగాలేకపోతే పాజిటివ్‌ మౌత్‌ టాక్‌ కూడా స్ప్రెడ్‌ చేయరు. బయట వాళ్లు సినిమా బాగా లేదంటూ చేసే విమర్శలను కూడా ఖండించరు.

కానీ తొలిసారి గుంటూరు కారం సినిమా విషయంలో మహేష్‌ బాబు అభిమానులు రోటిన్‌కి భిన్నంగా వ్యవహరించారు. అంతేకాక సినిమా మీద విమర్శలు చేసే వారికి ధీటుగా బదులిచ్చారు. సినిమాలోని పాజిటివ్‌ అంశాలను ప్రచారం చేస్తూ.. బాగుంది అన్న మౌత్‌ టాక్‌ వచ్చేలా చేశారు. సినిమా మీద వచ్చే నెగిటివిటీని, విమర్శలను, ట్రోల్స్‌ని తిప్పికొట్టారు. అందుకే సినిమా బాగా లేదని ఎందరు ఎన్ని విమర్శలు చేసినా, ట్రోల్స్‌ చేసినా.. గుంటూరు కారం ఫ్లాప్‌ కాలేదు. ప్రపంచవ్యాప్తంగా 212 కోట్లు కలెక్ట్‌ చేసి రికార్డులు సృష్టించింది.

 

కనీసం చిత్ర బృందం కూడా సినిమా పట్ల స్ట్రాంగ్‌గా నిలబడని వేళ.. అభిమానులు గుంటూరు కారం సినిమాకు పిల్లర్‌గా నిలిచి.. చిత్రం ఇంత భారీ కలెక్షన్లు రాబట్టడానికి కారణం అయ్యారు. ఒకవిధంగా చెప్పాలంటే.. మహేష్‌ బాబు అభిమానుల్లో వచ్చిన ఈ మార్పు వల్లే గుంటూరు కారం సినిమా నిలబడింది అంటున్నారు ఇండస్ట్రీ నిపుణులు. మొత్తానికి ఈ ఫ్యాన్స్‌ వల్ల ఈ సంక్రాంతి రేసులో రమణగాడు విజేతగా నిలిచాడని చెప్పవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి