iDreamPost

జై హనుమాన్‌లో రాముడిగా మహేశ్ బాబు? ప్రశాంత్ వర్మ ప్లానింగ్ వేరే ఉంది!

హనుమాన్ సక్సెస్ ఇచ్చిన బూస్టప్ తో ఈ మూవీ సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డారు ప్రశాంత్ వర్మ. జై హనుమాన్ పేరుతో సూపర్ హీరో కథను చెక్కనున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. అయితే ఈ పాత్ర కోసం పలువురి పేర్లు బయటకు వచ్చాయి. ప్రశాంత్ వర్మ ఏమన్నాడంటే..

హనుమాన్ సక్సెస్ ఇచ్చిన బూస్టప్ తో ఈ మూవీ సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డారు ప్రశాంత్ వర్మ. జై హనుమాన్ పేరుతో సూపర్ హీరో కథను చెక్కనున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. అయితే ఈ పాత్ర కోసం పలువురి పేర్లు బయటకు వచ్చాయి. ప్రశాంత్ వర్మ ఏమన్నాడంటే..

జై హనుమాన్‌లో రాముడిగా మహేశ్ బాబు? ప్రశాంత్ వర్మ ప్లానింగ్ వేరే ఉంది!

సజ్జా తేజ-ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన మూవీ హనుమాన్. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 11న పాన్ ఇండియా లెవల్లో రిలీజైంది. దర్శకుడు ఈ సినిమాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు ప్రేక్షకులు. భారీ విజయాన్ని అందించారు. కాసుల వర్షం కురిపించారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 275 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాను సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. జై హనుమాన్ పేరుతో సినిమా తీయబోతున్నాడు ఈ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్. అయితే ఇందులో హనుమాన్‌గా పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి.

హనుమాన్ మూవీలో ఆంజనేయుడు ఫేస్ రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ కళ్లు మెగాస్టార్ చిరంజీవి కళ్లులా ఉన్నాయని, రానా హనుమాన్ పాత్ర చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన ఇంటర్వ్యూలో పాల్గొని జై హనుమాన్ విషయాలను పంచుకున్నాడు ప్రశాంత్. ఈ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నానని.. ఇదంతా ఆ దేవుడు మ్యాజిక్ అని పేర్కొన్నాడు. ఇప్పుడు తనపై మరింత రెస్పాన్సిబులిటీ పెరిగిందని తెలిపాడు. ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి తను నెగిటివ్ గా మాట్లాడినట్లు వచ్చిన వార్తలపై స్పందించాడు. ‘నేను రాజమౌళికి ఏకలవ్య శిష్యుడిని. ఆయన దగ్గర శిష్యరికం చేద్దామంటే కుదరలేదు. ఆ ఇంటర్వ్యూలో మంచే చెప్పా. కానీ థంబ్ నెగిటివ్ పెట్టారు. వీడియోలో కూడా నెగిటివ్ సెన్స్ లేదు’ అని చెప్పారు.

‘ నాకు బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ అంటే గౌరవం. ప్రభాస్, మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకీ, నాగార్జున అంటే చాలా చాలా ఇష్టం. వారితో సినిమాలు యాడ్స్ చేశాను. సినిమాలు చేయాలనుకుంటున్నా. అయితే కుదరట్లేదు. స్టార్స్ తో చేయకూడదన్న యాటిట్యూట్ నాలో లేదు. జై హనుమాన్ స్టోరీ రెడీ అయ్యింది.. స్క్రిప్టు ప్రిపేర్ చేస్తున్నా. హనుమంతుని పాత్ర చేసేందుకు చాలా మంది ముందుకు వచ్చారు. ఈ సినిమాలో చాలా లుక్స్ ఉన్నాయి. ఎంటర్‌టైన్‌గా తెరకెక్కిస్తున్నా. హనుమంతుల వారు ఫేస్ చూడగానే దణ్ణం పెట్టేలా ఉండాలి. సూటయ్యే కాస్టింగ్ కోసం ఇంకా సంప్రదింపులు జరుపుతున్నా‘ అని తెలిపారు.

‘ దీని కోసం చిరంజీవి పేరు కూడా పరిశీలనలో ఉంది. పద్మ విభూషణ్ వచ్చాక ఆయన్ను కలవలేదు. ప్రస్తుతం ఆయన బిజీగా ఉన్నారు. చిరంజీవి ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్లి మీట్ అవుతాను. పాజిబులిటీస్ ఉన్నాయి. అలాగే రాముడు క్యారెక్టర్ కోసం.. మహేష్ బాబు చేస్తే బాగుంటుంది. రాముడి క్యారెక్టర్ కోసం మహేష్ బాబు మైండ్‌లో ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి’ అంటూ జై హనుమాన్ మూవీ గురించి అప్ డేట్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా సంబంధించి మరిన్ని వివరాలు పంచుకున్నారు డైరెక్టర్.  ఈ లెక్కన ప్రశాంత్ వర్మ పెద్ద ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.  ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి