iDreamPost

SSMB 29: మహేష్-జక్కన్న మూవీ నుంచి క్రేజీ అప్​డేట్.. ఆ రోజు నుంచే షూటింగ్ మొదలు!

  • Published Mar 05, 2024 | 1:57 PMUpdated Mar 05, 2024 | 1:57 PM

సూపర్​స్టార్ మహేష్ బాబు-దర్శకధీరుడు రాజమౌళి కాంబో మూవీ నుంచి మరో క్రేజీ అప్​డేట్. ఈ ఫిల్మ్ షూటింగ్​ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న వారికి గుడ్​న్యూస్.

సూపర్​స్టార్ మహేష్ బాబు-దర్శకధీరుడు రాజమౌళి కాంబో మూవీ నుంచి మరో క్రేజీ అప్​డేట్. ఈ ఫిల్మ్ షూటింగ్​ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న వారికి గుడ్​న్యూస్.

  • Published Mar 05, 2024 | 1:57 PMUpdated Mar 05, 2024 | 1:57 PM
SSMB 29: మహేష్-జక్కన్న మూవీ నుంచి క్రేజీ అప్​డేట్.. ఆ రోజు నుంచే షూటింగ్ మొదలు!

సూపర్​స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ రేంజ్​లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టైటిల్ ఇంకా ఫిక్స్ కాని ఈ చిత్రాన్ని ‘ఎస్ఎస్ఎంబీ 29’గా పిలుస్తున్నారు. మహేష్ చేస్తున్న 29వ సినిమా కావడమే అలా పిలవడానికి రీజన్. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద కేఎల్ నారాయణ అత్యంత భారీ వ్యయంతో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘ఎస్ఎస్ఎంబీ 29’ రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి మొదలవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. త్వరగా సెట్స్ మీదకు వెళ్తే షూటింగ్​ త్వరగా ముగుస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేష్-జక్కన్న మూవీ నుంచి ఓ క్రేజీ అప్​డేట్. ఈ చిత్రం షూటింగ్​కు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మహేష్​తో చేయబోయే మూవీ రెగ్యులర్ షూటింగ్​ను ఓ స్పెషల్ డే నాడు స్టార్ట్ చేయాలని దర్శకుడు రాజమౌళి ఫిక్స్ అయ్యారట. సూపర్​స్టార్ పుట్టిన తేదీ అయిన ఆగస్టు 9వ తేదీన ‘ఎస్ఎస్ఎంబీ 29’ చిత్రీకరణను ప్రారంభించేందుకు ప్లాన్స్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో ప్రీ ప్రొడక్షన్ పనుల్లో మరింత వేగం పెంచారట. నటీనటులు, టెక్నీషియన్ల ఎంపిక, షూటింగ్ లొకేషన్స్ సెలక్షన్, మ్యూజిక్ సిట్టింగ్స్.. ఇలా అన్నింటినీ ఆగస్టులోపే పూర్తి చేయాలని జక్కన్న డిసైడ్ అయ్యారట. స్టోరీ, స్క్రీన్​ లాక్ అయ్యాయి కాబట్టి డైలాగ్స్​ను కూడా రెడీ చేయిస్తున్నట్లు వినికిడి. ప్రీ ప్రొడక్షన్​ వర్క్​ను స్పీడ్​గా ఫినిష్ చేసి.. ఆగస్టు 9 నుంచి రెగ్యులర్ షూటింగ్​ను మొదలుపెట్టాలని రాజమౌళి అనుకుంటున్నారని సమాచారం. ప్రీ ప్రొడక్షన్ వర్క్​ పూర్తయితే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్​ మీద ఫోకస్ చేయాలని అనుకుంటున్నారట.

ఆగస్టు 9న ‘ఎస్ఎస్ఎంబీ 29’ షూట్ స్టార్ట్ అవనుందనే రూమర్ ఫిల్మ్ సర్కిల్స్​తో పాటు సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. కానీ భారీ సినిమా కావడం, హాలీవుడ్ రేంజ్​లో తెరకెక్కనుండటం, జక్కన్నది క్వాలిటీకి ఇంపార్టెంట్ ఇచ్చే మైండ్​సెట్ కావడంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కోసం ఆయన ఎక్కువ టైమ్ తీసుకోవడంలో ఆశ్చర్యం లేదని అంతా అంటున్నారు. మహేష్ మూవీ స్టార్ట్ అయ్యేది ఆ రోజే అంటూ రూమర్స్ వైరల్ అవడంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఒకవేళ ఆగస్టు 9న షూటింగ్ స్టార్ట్ అయితే మాత్రం మహేష్ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్ అని అంటున్నారు. సూపర్​స్టార్ బర్త్​ వేడుకల జోష్​లో ఉండే అభిమానులు.. ఆయన కొత్త చిత్రం ప్రకటనతో మరింత సంబురాలు చేసుకోవడం ఖాయం. మరి.. మహేష్-జక్కన్న మూవీ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఉపేంద్ర కొత్త పాట.. తెలుగు సెలబ్రిటీలపై సెటైర్లు వేస్తూ..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి