iDreamPost

తీరానికి కొట్టుకొచ్చిన భారీ ప్యాకెట్లు.. తెరిచి చూసి షాక్ గురైన పోలీసులు!

తీరానికి కొట్టుకొచ్చిన భారీ ప్యాకెట్లు.. తెరిచి చూసి షాక్ గురైన పోలీసులు!

అది మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలోని సముద్ర తీర ప్రాంతం. అయితే గత వారం రోజుల నుంచి ఈ తీరానికి పెద్ద ఎత్తున భారీ ప్యాకెట్లు కొట్టుకొచ్చాయి. ఈ ప్యాకెట్లను చూసి స్థానికులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఆ సముద్ర తీరానికి చేరుకున్న పోలీసులు ఆ సంచులను విప్పి చూశారు. అయితే అందులో ఉన్నది చూసి పోలీసులు షాక్ గురయ్యారు. అనంతరం వాటిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ భారీ ఫ్యాకెట్లలో ఏముందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలోని సముద్ర తీరం ప్రాంతం. ఇక్కడికి గత వారం రోజుల నుంచి 7 భారీ ప్యాకెట్లు కొట్టుకొచ్చాయి. స్థానికులు వాటిని చేసి భయపడిపోయి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఒడ్డున ఉన్న ఆ సంచులను తెరిచి చూశారు. అయితే ఆ ప్యాకెట్లలో భారీ మొత్తంలో డ్రగ్స్ ఉందని తెలుసుకున్నారు. అక్కడి నుంచి దాదాపు ఆ 250 కేజీలకు పైగా హశీష్ డ్రగ్స్ ప్యాకెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం అధికారులు మీడియతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. ఈ భారీ డ్రగ్స్ ప్యాకెట్లు పాకిస్తాన్, అప్గానిస్తాన్ నుంచి కొట్టుకొచ్చినట్లుగా అనుమానించారు. ఈ నెల 14 నుంచి 19 మధ్య కర్దే, లద్ఘర్, కెల్షి, కోల్తారే, మరుద్, బురోంది, బోరియా బీచ్ ల నుంచి ఈ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తీర ప్రాంతాల్లో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని, ఎవరైనా పడేసి వెళ్లిపోయారా? లేక పొరపాటున బీచ్ ఒడ్డుకు చేరాయే అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: సినిమా స్టైల్ క్రైమ్ స్టోరీ! యువతి కోసం రంగంలోకి ఏకంగా ముఖ్యమంత్రి!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి