iDreamPost

జగన్ బాటలో మహారాష్ట్ర ప్రభుత్వం

జగన్ బాటలో మహారాష్ట్ర ప్రభుత్వం

సంక్షేమం, అభివృద్ధి, పరిపాలనలో సరికొత్త ఆలోచనలతో ముందుకెళుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మహిళలకు భద్రత కల్పించే విషయంలో జగన్ సర్కారు చేసిన దిశ చట్టం ఇతర రాష్ట్రాలు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ బిల్లును తెప్పిచుకుని పరిశీలించాలని ఢిల్లీ, ఒడిస్సా ప్రభుత్వాలు నిర్ణయించుకోగా ఈ కోవలో తాజాగా మహారాష్ట్ర చేరింది.

వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన ‘దిశ’ చట్టాన్ని తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ‘దిశ’ చట్టంపై అధ్యయనం చేసేందుకు ఈ నెల 20న రాష్ట్రానికి వస్తున్నట్లు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ట్వీట్ చేశారు. మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ చట్టాన్ని అధ్యయనం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం.. మహిళలు, చిన్నారులపై ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడితే 21 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి దోషులను శిక్షిస్తారు. ఈ బిల్లులను రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించినా ఇంకా పూర్తిస్థాయిలో చట్టం కాలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే దిశ చట్టం అధికారికంగా అమలులోకి వస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి