iDreamPost

మహా రాజకీయ సంక్షోభం : స్టార్ హోటల్లో ఎమ్మెల్యేలు.. రోజుకు ఎంత ఖర్చవుతుందో తెలుసా ?

మహా రాజకీయ సంక్షోభం : స్టార్ హోటల్లో ఎమ్మెల్యేలు.. రోజుకు ఎంత ఖర్చవుతుందో తెలుసా ?

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొంది. శివసేన సీనియర్ నేత ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో సీఎం ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం ఏ క్షణాన కుప్పకూలుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికే షిండే 40 మంది ఎమ్మెల్యేలను తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు తెలుస్తుండగా.. అనుచర ఎమ్మెల్యేలతో కలిసి ఆయన అసోంకి మకాం మార్చారు. 40 మంది రెబల్ ఎమ్మెల్యేల కోసం గుహవాటిలో ఉన్న విలాసవంతమైన హోటల్ ను బుక్ చేశారు. తాజాగా ఈ హోటల్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి.

రెబల్ ఎమ్మెల్యేలు ముందుగా గుజరాత్ లోని సూరత్ లో ఉన్న హోటల్ లో ఉన్నారు. ఆ తర్వాత రాడిసన్ బ్లూ హోటల్ కు మకాం మార్చారు. ఈ ఫైవ్ స్టార్ హోటల్లో 7 రోజులు బస చేసేందుకు ఎమ్మెల్యేల కోసం ఏకంగా 70 రూమ్ లను బుక్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. 7 రోజులకు గాను అయ్యే ఖర్చు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. 7 రోజులు 70 రూమ్ లకు కేవలం బస చేసేందుకే అక్షరాలా రూ.56 లక్షలు అవుతుందట. అదనంగా ఆహారం, ఇతర సేవలు, సౌకర్యాలన్నీ కలిపి ఒక్కరోజుకు రూ.8 లక్షలు ఖర్చవుతుందని సమాచారం.

రాడిసన్ బ్లూ హోటల్ లో మొత్తం 196 రూమ్ లు ఉండగా.. రెబల్ ఎమ్మెల్యేల కోసం 70 రూమ్ లు బుక్ చేసేశారు. మిగిలిన రూమ్ లన్నీ కూడా బుక్ అయ్యాయి. దాంతో ప్రస్తుతానికి రాడిసన్ లో రూమ్ ల బుకింగ్ ను యాజమాన్యం నిలిపివేసినట్లు తెలుస్తోంది. బాంక్వెట్ ను కూడా మూసివేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ హోటల్లో బస చేస్తున్నవారిని తప్ప.. బయటి నుంచి వచ్చే వ్యక్తులను లోపలికి అనుమతించడం లేదని తెలుస్తోంది. కాగా.. ఎమ్మెల్యేలు ఛార్టెడ్ విమానంలో రాడిసన్ హోటల్ కు చేరుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఎమ్మెల్యేల కోసం ఈ ఖర్చంతా ఎవరు భరిస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి