iDreamPost

కొత్త సీఎం సంచలన నిర్ణయం.. బహిరంగ ప్రదేశాల్లో వాటిపై ఆంక్షలు!

ఇటీవలే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాడ్డాయి. తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అలానే మిగిలిన రాష్ట్రాలకు కొత్త ముఖ్యమంత్రులు వచ్చారు. ఈ క్రమంలో ఓ నూతన సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవలే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాడ్డాయి. తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అలానే మిగిలిన రాష్ట్రాలకు కొత్త ముఖ్యమంత్రులు వచ్చారు. ఈ క్రమంలో ఓ నూతన సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నారు.

కొత్త సీఎం సంచలన నిర్ణయం.. బహిరంగ ప్రదేశాల్లో వాటిపై ఆంక్షలు!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తరచూ ఏదో నిర్ణయం తీసుకుంటాయి. ముఖ్యంగా ప్రజల సంక్షేమం కోసం తరచూ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇక ఇటీవలే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసి..కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. తెలంగాణలో దాదాపు పదేళ్ల తరువాత ప్రభుత్వం మారింది. తాజాగా తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈయన బాటలోనే మరో కొత్త సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరి..ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

మధ్యప్రదేశ్‌ లో బీజేపీ ఘన విజయం సాధించింది. అంతేకాక బుధవారం భోపాల్ లో నూతన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజే సీఎం మోహన్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాలు, ప్రార్థనా స్థలాల పరిసరాల్లో లౌడ్ స్పీకర్లను నిషేధిస్తూ సంచలన  నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ లౌడ్ స్పీకర్ల నిషేధంతో పాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాంసం, గుడ్ల  అమ్మకాలకు సంబంధించి కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు భేటీ అనంతరం సీఎం మోహన్ యాదవ్ తెలిపారు.

mp cm take sensational decision

బహిరంగ ప్రదేశాల్లో మాంసం, గుడ్ల అమ్మకాలు చేయడంపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు. ఆ నిబంధనలు మధ్యప్రదేశ్ లో కచ్చితంగా అమలు చేసేందుకు కఠిన ఆదేశాలు జారీ చేశామని నూతన సీఎం తెలిపారు. వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించిన తర్వాత ఈ మేరకు చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆహార భద్రత విభాగం, పోలీస్ శాఖ, స్థానిక అధికారులు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారని సీఎం మోహన్ యాదవ్ చెప్పారు. డిసెంబర్ 15-31 మధ్య బహిరంగ ప్రదేశాల్లో మాంసం, గుడ్లు విక్రయంపై నిషేధం అమలవుతుందని వెల్లడించారు.

సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు లౌడ్ స్పీకర్ల వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలను తక్షణమే రాష్ట్రంలో అమలు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. అయితే  తక్కువ డెసిబెల్స్ తో వాడే స్పీకర్లపై ఎలాంటి పరిమితి  లేదని, తక్కువ శబ్ధం చేసే లౌడ్ స్పీకర్లను నిర్ణీత సమయాల్లో మాత్రమే పని చేయడానికి అనుమతి ఇస్తామని సీఎం ఆఫీస్ వెల్లడించింది. నిబంధనలకు అనుగుణంగా లౌడ్ స్పీకర్లు వాడితే ఎలాంటి చర్యలు ఉండవని ఉత్తర్వుల్లో పేర్కొంది.

మతపరమైన ప్రాంతాల్లో డీజే సౌండ్ ను పర్యవేక్షించడానికి జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇక బుధవారం మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. మధ్యప్రదేశ్ సీఎం ప్రమాణ స్వీకార  కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు వీవీఐపీ అతిథులు పాల్గొన్నారు. మరి.. మధ్యప్రదేశ్ సీఎం తీసుకున్న నిర్ణయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి