iDreamPost

దర్జాగా కారులో వచ్చి దోచేస్తుంది.. దొంగ కాదూ.. కిలాడీ లేడీ..!

ఎందులోనూ మగవాళ్లతో తాము తీసిపోము అని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు మహిళలు.. చివరికీ మోసం చేయడంలో కూడా. ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మహిళా పెద్ద ప్లానే వేసింది. కానీ చివరకు..

ఎందులోనూ మగవాళ్లతో తాము తీసిపోము అని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు మహిళలు.. చివరికీ మోసం చేయడంలో కూడా. ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మహిళా పెద్ద ప్లానే వేసింది. కానీ చివరకు..

దర్జాగా కారులో వచ్చి దోచేస్తుంది.. దొంగ కాదూ.. కిలాడీ లేడీ..!

ఇటీవల కాలంలో కిలాడీ లేడీలు ఎక్కువయ్యారు. మగవాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా మోసం చేయడంలో సిద్దహస్తులుగా మారిపోతున్నారు. నలుగురు అబ్బాయిలను తన మాటలతో మభ్యపెట్టి.. ప్రేమ, పెళ్లి అంటూ చీటింగ్ చేస్తున్నారు. వారి వద్ద నుండి అందిన కాడికి దోచేసుకుంటున్నారు. అలాగే షాపుల్లోకి వెళ్లి.. చాక చక్యంగా ఖరీదైన నగలు కొట్టేస్తున్నారు ఘరానా మోసగత్తెలు. ఇదిగో ఈ ఫోటోలో పిల్లవాడితో కనిపిస్తున్న మహిళను చూశారా.. సరికొత్త మోసానికి తెరలేపింది. ఆమె బంగారు దుకాణాలను టార్గెట్ చేసింది. అలా అనీ.. దొంగతనం చేస్తుందేమో అనుకునేరు.. కానే కాదూ బంగారాన్ని..షాపు యజమానులే స్వయంగా ఆమెకు అప్పగించేలా చేస్తుంది. ఏంటీ వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం.

మరీ అక్కడే అసలైన చీటింగ్ ఉంది. నకిలీ నగలు తీసుకెళ్లి.. అసలు సిసలైన బంగారాన్ని కొట్టేస్తుంది ఆ అమ్మడు. దర్జాగా కారులో వస్తుంది. తన వద్ద ఉన్న నగలను మార్చి కొత్త నగలు తీసుకుంటానని చెబుతుంది. దీంతో నిజమేనుకొని వాటిని తనిఖీ చేయని కొన్ని షాపుల యజమానులు.. ఆ నకిలీ బంగారానికి తగ్గట్లు.. నయా బంగారాన్ని అందిస్తున్నారు. ఆ తర్వాత మోసపోయామంటూ గొల్లుమంటున్నారు. ఈ తరహా మోసాలు ఎక్కువ కావడంతో అలర్డ్ అయ్యారు బంగారం దుకాణాదారులు. రాగి నగలకు బంగారం పూత పూసి వాటిని జ్యుయెల్లరీ షాపులకు తీసుకెళ్లి.. కొత్త నగలు మార్పించుకుంటూ ఉంటుంది. భీమవరం, నర్సాపురం ప్రాంతాల్లో ఇలాంటి చీటింగ్ జరిగే సరికి జ్యుయెల్లరీ దుకాణాదారులు.. ఆమె ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆమె కనిపిస్తే.. పట్టుకోవాలని భావించారు.

తాజాగా ఆ మహిళ పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ఇలాంటి మోసానికి పాల్పడుతుంటే.. పట్టుకున్నాడు ఓ షాపు యజమాని. బంగారం పూత ఉన్న రాగి చైన్ తీసుకుని ఓ షాపు వద్దకు వెళ్లగా.. యజమాని ఆమెను మాటల్లో పెట్టి.. కిలాడీ లేడీని నిర్బంధించాడు. మోసపోయిన వ్యక్తులను పిలిపించగా.. ఆమె అని నిర్దారణ అయ్యింది. ఈ మహిళది కృష్ణా జిల్లాలోని మచిలీ పట్నంగా గుర్తించారు. తాను ఆన్లైన్ షాపింగ్ లో వస్తువులు కొని అమ్ముతున్నట్టు మహిళ చెబుతుంది. మహిళ బంధువులకు సమాచారం అందించారు షాపు యజమానులు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెబుతున్నారు పోలీసులు. మరీ ఈ తరహా మోసాన్ని ఏమంటారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి