iDreamPost

Love In Singapore : మెగాస్టార్ నటించిన ఫారిన్ లవ్ స్టోరీ – Nostalgia

Love In Singapore : మెగాస్టార్ నటించిన ఫారిన్ లవ్ స్టోరీ – Nostalgia

ఇప్పుడంటే ఆకాశమంత ఇమేజ్ తో చిరంజీవి మెగాస్టార్ గా అందరికీ సుపరిచితం కానీ కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఎదురుదెబ్బలు ఎన్నో జ్ఞాపకాలు ఇప్పుడు తరచి చూస్తే చాలా ఆసక్తిగా ఉంటాయి. 1979 నాటికి చిరుకి మంచి నటుడిగా పేరొచ్చింది కానీ ఇంకా స్టార్ అని చెప్పుకునే స్థాయి రాలేదు. ఆ సమయంలో చేసిన సినిమానే లవ్ ఇన్ సింగపూర్. కన్నెవయసు(971) అనే ఆఫ్ బీట్ చిత్రంతో పరిచయమైన డైరెక్టర్ ఓఎస్ఆర్ ఆంజనేయులుకు దాని ఫలితం వల్ల చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. గోపాలకృష్ణ అందించిన కథకు దర్శకత్వం వహించమని ఎస్విఎస్ ఫిలిమ్స్ నుంచి కబురు అందింది. ఆయన ఇంకేమి ఆలోచించలేదు. ఎస్ చెప్పేశారు.

టైటిల్ లవ్ ఇన్ సింగపూర్. బై లింగ్వల్ గా తెలుగు మలయాళంలో ఒకేసారి తీశారు. అక్కడ క్యాస్టింగ్ ప్లస్ డైరెక్టర్ వేరు. రెండు యూనిట్లను తీసుకుని నిర్మాతలు సింగపూర్, హాంగ్ కాంగ్, బ్యాంకాక్ తదితర దేశాల్లో ఖర్చుకు వెనుకాడకుండా షూటింగ్ చేశారు. రంగనాథ్, లత, పిజె శర్మ, హేమసుందర్, అత్తిలి లక్ష్మి తదితరులు ప్రధాన తారాగణం. మోదుకూరి జాన్సన్, చిట్టిబాబులు సంభాషణలు సమకూర్చగా శంకర్ గణేష్ సంగీతం అందించారు. పోరాట దృశ్యాలను త్యాగరాజన్ కంపోజ్ చేశారు. చిరంజీవి మొట్టమొదటి సారి ఫారిన్ ట్రిప్ చేసింది ఈ సినిమాతోనే. అప్పటిదాకా చేసిన షూటింగులన్నీ ఇండియాలోనే జరిగాయి.

చిత్రీకరణ జరుపుతున్న టైంలో లవ్ ఇన్ సింగపూర్ సినిమాకు సంబంధించి మీడియా చిరంజీవికి రంగనాథ్ తో సమానంగా ప్రాధాన్యం ఇచ్చేవి. అప్పటికే పున్నమినాగు లాంటి పెద్ద హిట్లు చిరుకు పడ్డాయి. రజినీకాంత్ తో కాళీ, కమల్ హాసన్ తో ఇది కథ కాదు సినిమాలు చేయడం ద్వారా గుర్తింపు వచ్చింది. ఇక స్టోరీ విషయానికి వస్తే విదేశాల్లో ఉన్న విలన్ ని చిన్నప్పుడే విడిపోయిన అన్నదమ్ములు తిరిగి కలుసుకుని అంతం చేసే పాయింట్ తో రూపొందించారు. 1980 సెప్టెంబర్ 27 విడుదలైన లవ్ ఇన్ సింగపూర్ కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకుంది. తెరమీద కనిపించిన రిచ్ నెస్ ఆకట్టుకుంది. చిరులోని నటుడిని మరింత బలంగా రిజిస్టర్ చేసింది

Also Read : Gharana Bullodu : ఘరానా ఫార్ములాతో నాగార్జున అల్లరి – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి