iDreamPost

డక్ వర్త్ లూయిస్ సృష్టికర్త ‘లూయిస్’ ఇక లేరు

డక్ వర్త్ లూయిస్ సృష్టికర్త ‘లూయిస్’ ఇక లేరు

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ను ప్రేమించే అభిమానుల్లో ‘డక్ వర్త్ లూయిస్’ సిస్టం గురించి తెలియని వారు ఉండరేమో.. ఆధునిక క్రికెట్ లో బాగా పాపులర్ అయిన ఈ పదం అందరికీ సుపరిచితమే.. వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్‌లు మధ్యలోనే ఆగిన‌ప్పుడు, తిరిగి లక్ష్యాన్ని నిర్దేశించ‌డానికి, విజేతలను నిర్ణయించడానికి ఈ ప‌ద్థతిని వాడుతార‌న్న సంగ‌తి మనకు తెలిసిందే.

కగా, అంతర్జాతీయ క్రికెట్‌కు ఈ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిని పరిచయం చేసిన ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ టోనీ లూయిస్‌(78) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యం బాధపడుతున్న లూయిస్‌ ఇక లేరనే విషయాన్ని ఇంగ్లండ్‌-వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) ప్రకటించింది. 1997లో ఫ్రాంక్ డ‌క్‌వ‌ర్త్‌తో క‌లిసి టోనీ లూయిస్ ఈ ప‌ద్ధ‌తిని ప్ర‌తిపాదించారు. దీనికి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) 1999లో ఆమోద ముద్ర వేసి వన్డే క్రికెట్ ఫార్మాట్ లొ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ప్రధానంగా వర్షం కురిసి మ్యాచ్‌ లు సగంలో ఆగిపోతే అప్పుడు ఈ పద్ధతిని ఉపయోగించి విజేతను ప్రకటించడం నేటికీ ఆనవాయితీగా వస్తుంది.
ప్ర‌స్తుతం దీన్ని డ‌క్‌వ‌ర్త్ లూయిస్ స్టెర్న్ ప‌ద్ధ‌తిగా పిలుస్తున్నారు. అప్పుడప్పుడు ఈ డక్ వర్త్ లూయిస్ శాస్త్రీయత పై పలు విమర్శలు వచ్చినప్పటికి.. ఇప్పటివరకూ దీనిని మించిన మరో శాస్త్రీయ పద్దతి లేకపోవడం విశేషం.

లూయిస్ మ‌ర‌ణంపై పలువురు క్రికెట్ ప్రముఖులతో పాటు ఇంగ్లండ్‌ క్రికెట్ బోర్డు కూడా సంతాపం వ్య‌క్తం చేసింది. క్రికెట్‌కు ఆయ‌న ఎంత‌గానో సేవ చేశార‌ని బోర్డ్ అభిప్రాయ‌ప‌డింది. గతంలో ఇంగ్లండ్‌ జట్టుకు కెప్టెన్‌గా సేవలందించిన లూయిస్‌.. ఆపై జర్నలిస్టుగానూ సేవలందించారు. 1990 వ దశకంలో ఆయన బీబీసీ టెలివిజన్‌ కామెంటేటర్‌గా కుడా కొన్నాళ్లు పనిచేశారు. ఇక క్రికెట్‌ లా మేకర్‌ అయిన ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) అధ్యక్షుడిగా సైతం సేవలందించిన అరుదైన ఘనత ఘనత టోనీ లూయిస్‌ సొంతం చేసుకున్నాడు.

తన జీవితాంతం క్రికెట్ అభివృద్ది కోసం విశిష్టంగా సేవల అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి టోనీ లూయిస్ మరణం యావత్ క్రికెట్ రంగానికే కాక యావత్ క్రీడా ప్రపంచానికే తీరని లోటు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి