iDreamPost

Ayodhya: అయోధ్య రాముడి వేడుకకు 6 వేల మందికి ఆహ్వానాలు!

ఈ విషయాన్నీ ఇప్పటికే మందిర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. మరో వైపు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా.. ఉత్తరప్రదేశ్ లోని ప్రధాన ఆలయాల్లో అఖండ రామాయణం, హనుమాన్ చాలీసా పారాయణాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ విషయాన్నీ ఇప్పటికే మందిర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. మరో వైపు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా.. ఉత్తరప్రదేశ్ లోని ప్రధాన ఆలయాల్లో అఖండ రామాయణం, హనుమాన్ చాలీసా పారాయణాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Ayodhya: అయోధ్య రాముడి వేడుకకు 6 వేల మందికి ఆహ్వానాలు!

కోట్లాది మంది భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం అతి చేరువులో ఉంది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ పనులు వేగంగా సాగుతున్నాయి. 2024 జనవరి 22న రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరగనుంది. ఈ క్రమంలో మందిర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ప్రారంభోత్సవ వేడుకుల కోసం ఆహ్వాన పత్రికలను సిద్ధం చేశారు. దాదాపు ఆరు వేల మందికి ఈ ఆహ్వాన పత్రికలు పోస్ట్ ద్వారా అందనున్నాయి. అయితే ఆ ఆహ్వాన పత్రికలో ఎన్ని రోజులు స్వామివారి సన్నిధిలో ఉండాలి అనేది కూడా వారు అభ్యర్ధించారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

సీతాసమేత శ్రీరామ చంద్రుల వారు.. ఆ మహాత్ముని జన్మభూమి అయిన అయోధ్యలో కొలువు తీరే సమయం ఆసన్నం అయింది. యావత్‌ భారతదేశం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం.. వేడుకలకు సర్వం సిద్ధమౌతోంది. రాబోయే జనవరి 22న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ మహత్తర సన్నివేశాలను తిలకించడానికి దేశ వ్యాప్తంగా భక్తులు తరలిరానున్నారు. స్వామి వారి సేవా కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఎంతో భక్తితో వేచి చూస్తున్నారు.

ఈ ప్రాణ ప్రతిష్ట వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిధిగా విచ్చేయనున్నారు. వారితో పాటు దేశంలోని ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. ఈ క్రమంలో రామ మందిర నిర్వాహకులు ఆరు వేల మందికి ఆహ్వాన పత్రికలు అందిస్తున్నారు. దేశమంతటా నివసిస్తున్న సాధువులను, ఆశ్రమ వాసులను సాదరంగా ఆహ్వానిస్తున్నారు. కాగా, భక్తుల సౌకర్యార్థం ఈ మహోత్సవంలో పాల్గొన దలిచిన వారు ఒక రోజు ముందుగా ఆ పవిత్ర స్థలానికి చేరుకోవాలని.

అనంతరం జనవరి 23న తిరిగి వెళ్లిపోయేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని. ఆలయ నిర్వాహకులు ఆహ్వాన పత్రిక ద్వారా తమ అభ్యర్ధనను తెలియజేశారు. దాదాపు పది రోజుల పాటు ఈ ప్రతిష్ట వేడుకలు జరగనున్నాయి. ఆలయ గర్భ గుడిలో శ్రీ రామ చంద్రుల వారి విగ్రహాన్ని 2024 జనవరి 22 మధ్యాహ్నం 12.45-1.00 గంటల మద్యన ప్రతిష్టించనున్నారు. ఇక రామ మందిర నిర్మాణ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. మందిర ప్రారంభోత్సవ సమయానికి అంతా సిద్ధం చేయనున్నట్లు సమాచారం. ఆ అయోధ్య రామయ్య సేవా భాగ్యాన్ని నోచుకునేందుకు భక్తి పారవశ్యంతో కోట్లాది మంది ప్రజలు వేచి ఉన్నారు. మరి సీతా సమేత శ్రీ రామ చంద్రుల వారు రామ జన్మ భూమిలో కొలువు తీరే.. ఈ విశేష అంశం మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి