iDreamPost

‘లియో’ కలెక్షన్లపై లోకేష్‌ స్పందన.. వాస్తవాలు ఒప్పుకున్నాడు!

తాను లియో కలెక్షన్లపై మాట్లాడినందుకు తనపై థియేటర్‌ ఓనర్‌ అయిన లలిత్‌ కుమార్‌ బెదిరింపులకు దిగాడని అన్నారు. ఈ వివాదం రోజు రోజుకు ముదురుతూ పోతోంది.

తాను లియో కలెక్షన్లపై మాట్లాడినందుకు తనపై థియేటర్‌ ఓనర్‌ అయిన లలిత్‌ కుమార్‌ బెదిరింపులకు దిగాడని అన్నారు. ఈ వివాదం రోజు రోజుకు ముదురుతూ పోతోంది.

‘లియో’ కలెక్షన్లపై లోకేష్‌ స్పందన.. వాస్తవాలు ఒప్పుకున్నాడు!

ఇళయ దళపతి విజయ్‌-లోకేష్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘లియో’ అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. గత కొద్దిరోజులనుంచి కలెక్షన్ల విషయంలో వివాదం నడుస్తోంది. లియో సినిమా టీం చెబుతున్న కలెక్షన్లకు.. వాస్తవ కలెక్షన్లకు పొంతన లేదని థియేటర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు సుబ్రమణియన్‌ చెబుతున్నారు. ఈ మేరకు ఆయన సంచలన ఆరోపణలు చేశారు. లియో టీం దాదాపు 5 కోట్ల రూపాయల స్కాంకు పాల్పడిందని అన్నారు.

తాను లియో కలెక్షన్లపై మాట్లాడినందుకు తనపై థియేటర్‌ ఓనర్‌ అయిన లలిత్‌ కుమార్‌ బెదిరింపులకు దిగాడని అన్నారు. ఈ వివాదం రోజు రోజుకు ముదురుతూ పోతోంది. కొంతమంది సుబ్రమణియన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా, లియో కలెక్షన్ల వివాదంపై లోకేష్‌ కనగరాజ్‌ స్పందించారు. ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ‘‘ నేను థియేటర్లకు వెళ్లి రెస్పాన్స్‌ చూశాను. సెకండ్‌ హాఫ్‌కు మిశ్రమ స్పందన వచ్చింది. సెకండ్‌ హాఫ్‌ ల్యాగ్‌గా ఉందని నాకు ఫీడ్‌ బ్యాక్‌ వచ్చింది. నేను దాన్ని అంగీకరిస్తాను. నేను కలెక్షన్ల విషయాన్ని నిర్మాతలకు వదిలేస్తున్నా’’ అని అన్నారు. కాగా, లియోకు రోజురోజుకు స్పందన తగ్గిపోతోంది.

సినిమా టీం చెప్పేది ఒక విధంగా.. ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ మరో విధంగా ఉంటున్నాయి. ఆదివారం అయినా కూడా ఒక్క థియేటర్‌లో కూడా హౌస్‌ ఫుల్‌ బోర్డు కనిపించలేదు. ఇదే విషయాన్ని సుబ్రమణియన్‌ మద్దతుదారులు తెరపైకి తెస్తున్నారు. థియేటర్లలో స్పందన లేని సినిమాకు కలెక్షన్లు ఎలా వస్తాయని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి లోకేష్‌ చెప్పిన సమాధానం మాత్రం అభిమానులు, నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. అలా అనటానికి ధైర్యం ఉండాలి అని అంటున్నారు. మరి, లోకేష్‌ చెప్పిన సమాధానంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి