iDreamPost

మే మధ్య వరకు లాక్ డౌన్ 

మే మధ్య వరకు లాక్ డౌన్   

ఓవైపు లాక్‌డౌన్‌ గడువు ముంచుకొస్తున్నా.. మరో వైపు కరోనా వైరస్ నియంత్రణలోకి రాకపోవడంతో లాక్ డౌన్ ను మే మధ్య వరకు పొడిగించాలని నిపుణుల కమిటీ సూచిస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నియమించిన నిపుణుల కమిటీ రాష్ట్రంలోని కరోనా వైరస్ ప్రభావంపై క్షేత్రస్థాయిలో పరిశీలన, విశ్లేషణ చేసి నివేదికను అందజేసింది. కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ ను మే మధ్య వరకు పొడిగించాలని నిపుణుల కమిటీ కేజ్రీవాల్ ప్రభుత్వానికి సూచించింది. లేకపోతే వైరస్ ను అదుపుచేయలేని హెచ్చరించింది.

డిల్లీలో రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 111 మందికి కి వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2625 కి చేరాయి. గడిచిన 24 గంటల్లో ఒకరు మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 54 కి చేరింది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య లో చిన్న రాష్ట్రమైన ఢిల్లీ మూడవ స్థానంలో ఉంది. మహారాష్ట్ర 7,628 కేసులతో మొదటి స్థానంలో ఉండగా, గుజరాత్ 3,071 కేసులతో రెండవ స్థానంలో నిలిచింది.

దేశం మొత్తం మీద ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 24, 942 కు చేరింది. ఇందులో 5,209 మంది ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం 18,953 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా కారణంగా ఇప్పటి వరకు 779 మంది ప్రాణాలు కోల్పోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి