iDreamPost

మంత్రి సబితకు స్వల్ప అస్వస్థత

మంత్రి సబితకు స్వల్ప అస్వస్థత

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి నిన్న రాత్రి అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి కారణంగా ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రికి తరలించారు. దీంతో సబితా ఆరోగ్యం బాలేదని తెలుసుకున్న సబితా అభిమానులు పార్టీ కార్యకర్తలు, అనుచరులు, ఆందోళన చెందారు. మంత్రి సబిత అస్వస్థతకు గురయ్యారని తెలియగానే పలువురు ముఖ్య నేతలు మంత్రులు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.

కాగా సబితా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. సబిత ఇంద్రారెడ్డి ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి కార్యాలయం ప్రకటనలో వెల్లడించింది. “సబితా ఇంద్రారెడ్డి అభిమానులు, పార్టీ కార్యకర్తలు, అనుచరులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. సబిత సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రికి వెళ్లారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించగా రిపోర్ట్‌లు నార్మల్‌గానే వచ్చాయి. మరి కొద్ది సేపట్లో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకోనున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరి ఆదరాభిమానాలు, దేవుని కృపతో మంత్రి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు”అని విద్యాశాఖ మంత్రి కార్యాలయం ప్రకటనలో తెలిపింది. సబిత ఆరోగ్యం నిలకడగా ఉందని తెలియడంతో అభిమానులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి