iDreamPost

This Week Movie Releases: ఈ వారం థియేటర్ లో విడుదల కాబోయే సినిమాలు ఇవే !

  • Published Feb 28, 2024 | 12:11 PMUpdated Feb 28, 2024 | 12:11 PM

ఇప్పటివరకు ఓటీటీలలో విడుదల అయ్యే సినిమాల గురించి తరచూ అప్ డేట్స్ చూస్తూనే ఉన్నాము . ఇక ఇప్పుడు థియేటర్ లో ఈ వారం సందడి చేయబోయే సినిమాల జాబితా ఇలా ఉంది.

ఇప్పటివరకు ఓటీటీలలో విడుదల అయ్యే సినిమాల గురించి తరచూ అప్ డేట్స్ చూస్తూనే ఉన్నాము . ఇక ఇప్పుడు థియేటర్ లో ఈ వారం సందడి చేయబోయే సినిమాల జాబితా ఇలా ఉంది.

  • Published Feb 28, 2024 | 12:11 PMUpdated Feb 28, 2024 | 12:11 PM
This Week Movie Releases: ఈ వారం థియేటర్ లో విడుదల కాబోయే సినిమాలు ఇవే !

తెలుగు ప్రేక్షకులకు సినిమాల పైన ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. భాషతో , జోనర్ తో సంబంధం లేకుండా కథను బట్టి సినిమాను ప్రేమించేస్తూ ఉంటారు . అటు థియేటర్ లో సినిమాలు విడుదలైనా , ఇటు ఓటీటీలలో సినిమాలు విడుదలైనా .. వెంటనే వాటికి ఎంతో ఆదరణ లభించడానికి కారణం ప్రేక్షకులే. ఇక థియేటర్ లో విడుదలయ్యే సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విడుదలకు ముందు నుంచే ఆయా సినిమాలకు హైప్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ వారం థియేటర్ లో విడుదలయ్యే అయ్యే సినిమాల జాబితా భారీగానే ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

1) ఆపరేషన్ వాలెంటైన్ :
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మార్చి 1న థియేటర్ లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను పుల్వామా అటాక్స్ తరవాత జరిగిన.. ఎయిర్ స్ట్రైక్స్ ఆధారంగా తీసుకుని .. తెరకెక్కించారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన.. ట్రయిలర్ తో అందరు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. విడుదలకు మరికొద్దిరోజుల సమయం మాత్రమే ఉండడంతో చిత్ర బృందం.. మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. మరి విడుదల తర్వాత ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకుల అంచనాలను నిలబెట్టుకుంటుందో.. వేచి చూడాలి.

2) భూతద్దం భాస్కరనారాయణ:
ఇక ఈ సినిమా విషయానికొస్తే .. అందరి ఇళ్ల ముందు ఉండే దిష్టి బొమ్మల వెనుక ఉండే కథ ఏంటి అనే .. సరికొత్త కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా సరికొత్తగా చేస్తున్నారు . ఇప్పటికే పబ్లిక్ లో ఈ సినిమాకు సంబంధించి పాజిటివ్ బజ్ నడుస్తోంది. హర్రర్ మూవీస్ ను ఇష్టపడే వారికీ ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా కంటెంట్ క్లిక్ అయితే కనుక .. ఈ సినిమా హిట్ కొట్టడం ఖాయం. ఈ సినిమా కూడా మార్చి 1న థియేటర్ లలో ప్రేక్షకులను అలరించనుంది.

3) చారి 111:
వెన్నెల కిషోర్ హీరోగా మొదటి డెబ్యూ ఫిల్మ్ చారి 111 . ఈ సినిమాలో సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను ఓ స్పై మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. ఇప్పటివరకు వెన్నెల కిషోర్ కామెడీ చూసిన ప్రేక్షకులు ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్ హీరోయిజం కూడా చూడనున్నారు. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి .

4) వ్యూహం:
రామ్ గోపాల వర్మ దర్శకత్వంలో.. ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా వ్యూహం. ఈ సినిమా విడుదల ఇప్పటివరకు .. ప్రతిపక్ష పార్టీల వలన పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమాను మార్చి 1న విడుదల చేయనున్నారు. మరి , విడుదల తర్వాత ఈ సినిమా ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.

5) ఇంటి నెంబర్13:
మూవీ నేమ్ చూస్తుంటే అందరికి అర్థమైపోతుంది.. ఇది ఒక హర్రర్ కంటెంట్ ఉన్న సినిమా అని. ఆనంద్ రాజ్, తనికెళ్ల భరణి, అమృతం అప్పాజీ , ఇలా అనేక మంది యాక్టర్స్ తో.. ఈ సినిమాను చిత్రీకరించారు. పన్నారాయల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. హర్రర్ సినిమాలను ఆదరించేవారికి ఈ సినిమా నచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు అఆకట్టుకుంటుంది అనేది విడుదల తర్వాత తెలుస్తోంది.

మరి ఈ సినిమాలు థియేటర్ లో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకోనున్నాయో వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ , పోస్టర్స్ , ప్రమోషన్స్ తో ఈ సినిమాల మీద పాజిటివ్ బజ్ నడుస్తోంది. మరి ఈ వారం థియేటర్ లో విడుదల కాబోయే మూవీ అప్ డేట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి