iDreamPost

మందుబాబులకు బ్యాడ్ న్యూస్… 4 రోజుల పాటు వైన్ షాపులు బంద్!

మందుబాబులకు బ్యాడ్ న్యూస్… 4 రోజుల పాటు వైన్ షాపులు బంద్!

నేటికాలంలో మద్యం తాగే వారి సంఖ్య బాగా పెరిగింది. ఏ చిన్న వేడుక చేసిన అక్కడ మద్యం తప్పని సరిగా ఉంటుంది. అదిలేనిదే పార్టీ లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇక వీకెండ్ వచ్చిదంటే చాలు.. చాలా మంది మందులో మునిగి తేలుతుంటారు. కొందరికి అయితే మద్యం తాగడంతోనే రోజు ప్రారంభమవుతుంది. ఇలా మద్యంతో ఎంజాయ్ చేసే మందుబాబులకు  ఓ చేదు వార్త. రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకుని  నాలుగు రోజులను డ్రై డేలుగా  ప్రభుత్వం ప్రకటించింది.

మొహ్రరం, స్వాతంత్ర దినోత్సవం, శ్రీకృష్ణాష్టమి, ఈద్-ఏ-మిలాద్ పండగల వేళ మద్యం దుకాణాలు మూసి వేయబడతాయని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ ప్రకటన చేసింది.. మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కాదులేండి. దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఉన్న కేజ్రివాల్ ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. రాబోయే ఈ నాలుగు పండుగ రోజుల్లో వైన్ షాపులు మూసి వేయబడతాయని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. జూలై 29న మొహర్రం,  ఆగష్టు 15, సెప్టెంబర్ 7న జన్మాష్టమి, సెప్టెంబర్ 28న ఈద్-ఏ-మిలాద్  పండల వేళ ఢిల్లీలోని మద్యం దుకాణాలు మూసివేయబడతాయి. త్వరలో పండుగల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర్యం దినోత్సవం రోజున మద్యం షాపులను మూసివేయాలనే రూల్ ఇప్పటికే ఉన్న విషయం మనకు తెలిసిందే.

అంతేకాకుండా పండుగల దృష్ట్యా మద్యం దుకాణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొవచ్చు.  ఈ క్రమంలోనే ఈ నాలుగు రోజులు మద్యం షాపులను మూసివేయలని ఎక్సైజ్ శాఖ.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. అనంతరం ఈ ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఢిల్లీ ప్రభుత్వం డ్రైడే జాబితాను విడుదల చేస్తుంది. ఏటా మాదిరిగానే ఈ ఏడాది ఎక్సైజ్  శాఖ డ్రై డేల షెడ్యూల్ ను విడుదల చేసింది.  ఎన్నికలు, మరికొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ డ్రై డేల సంఖ్య పెరగవచ్చని అధికారి ఒకరు తెలిపారు. మరి.. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: స్మశానంలో ప్రేమ పెళ్లి.. ఎందుకో తెలుసా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి