iDreamPost

Liger Release : విజయ్ దేవరకొండ గ్యాప్ ఇంకా పెరిగింది

Liger Release : విజయ్ దేవరకొండ గ్యాప్ ఇంకా పెరిగింది

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న లైగర్ అప్డేట్ వచ్చేసింది. విడుదల తేదీని 2022 ఆగస్ట్ 25కి ఫిక్స్ చేశారు. ఇది మరీ ఎక్కువ గ్యాప్ అనిపిస్తున్నా ఇలా నిర్ణయం తీసుకోవడం వెనుక పలు కారణాలు ఉన్నాయట. మైక్ టైసన్ లాంటి ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు ఇందులో నటించడంతో పాటు యుఎస్ షెడ్యూల్ ని మళ్ళీ కొనసాగించే అవసరం ఉందట. దానికి తోడు కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ కు సంబంధించిన కొన్ని రీ షూట్లు అవసరం పడొచ్చని ఇన్ సైడ్ టాక్. కొంతమేర విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఉందని దానికోసం మంచి క్వాలిటీ టీమ్ ని సెట్ చేయడానికి దర్శకుడు పూరి జగన్నాధ్ ఎక్కువ సమయం అడిగారని సమాచారం.

అందులోనూ ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి రిలీజ్ టైంకి కాంపిటీషన్ లేకుండా జాగ్రత్త పడాలి. ప్రస్తుతానికి అయితే ఆ తేదీకి ఎలాంటి పోటీ లేదు. అలా అని ఎవరూ రారన్న గ్యారెంటీ లేదు. లైగర్ ఇంకా సగమే పూర్తయ్యిందని అంటున్నారు. అందుకే ఏదో ఒక డేట్ చెప్పేసి హడావిడి పడకుండా స్లోగా అయినా సరే బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వాలనే సంకల్పంతో ఇలా చేస్తున్నారని వార్త. నిజానికి కరోనా ఫస్ట్ వేవ్ పూర్తయ్యాక లైగర్ ని 2021 సెప్టెంబర్ కి లాక్ చేస్తూ పోస్టర్ కూడా వదిలారు. కానీ షూట్ జరగలేదు. విజయ్ దేవరకొండతో పాటు ఇతర ఆర్టిస్టుల కాల్ షీట్స్ సమస్య వల్ల ఆలస్యం అంతకంతా పెరుగుతూ పోయింది. చివరికి ఇలా డిసైడ్ అయ్యింది.

విజయ్ దేవరకొండ సినిమా వచ్చి వచ్చే ఆగస్ట్ నాటికి రెండున్నర ఏళ్ళు అవుతుంది. వరస ఫ్లాపులతో సతమతమైన ఈ యూత్ స్టార్ కి బ్లాక్ బస్టర్ అవసరం చాలా ఉంది. ఇస్మార్ట్ శంకర్ తో బౌన్స్ బ్యాక్ అయిన పూరి జగన్నాథ్ తన పేరు మళ్ళీ ఇండస్ట్రీలో మారుమ్రోగడం దీంతోనే ఖాయమనే నమ్మకంతో ఉన్నాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సంగీత దర్శకుడు ఎవరో ఇప్పటిదాకా ప్రకటించనే లేదు, బ్యానర్, హీరో, డైరెక్టర్, మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ అని తప్ప ఇంకే వివరాలు చెప్పడం లేదు. ఈ లెక్కన అసలు పాటల రికార్డింగ్ కూడా జరిగినట్టు లేదు. ఇక చిత్రీకరణ గురించి చెప్పదేముంది. సో లైగర్ కోసం తొమ్మిది నెలల నిరీక్షణ తప్పదు

Also Read : RRR Promotions : అంచనాలకు అందని రీతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి