iDreamPost

TDPలో అసంతృప్తి! చంద్రబాబు మాటని లెక్క చేయని నేతలు!

Nara Chandrababu: ఏపీలో ఎన్నికల దగ్గర పడేకొద్ది అన్నీ పార్టీల్లోని అసంతృప్తులు బయటకు వస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీ ఈ తీవ్ర ఎక్కువగా కనిపిస్తోంది. చంద్రబాబు మాటని లెక్క చేసే పరిస్థితిలో ఆ పార్టీ నేతలు లేనట్లు కనిపిస్తోంది.

Nara Chandrababu: ఏపీలో ఎన్నికల దగ్గర పడేకొద్ది అన్నీ పార్టీల్లోని అసంతృప్తులు బయటకు వస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీ ఈ తీవ్ర ఎక్కువగా కనిపిస్తోంది. చంద్రబాబు మాటని లెక్క చేసే పరిస్థితిలో ఆ పార్టీ నేతలు లేనట్లు కనిపిస్తోంది.

TDPలో అసంతృప్తి! చంద్రబాబు మాటని లెక్క చేయని నేతలు!

ఆంధ్రప్రదేశ్ రాజకీయం అనే సముద్రంలో ఎలక్షన్ అనే  తుఫాన్ మరికొద్ది రోజుల్లో తీరం వైపు రానుంది. ఈక్రమంలోనే రాజకీయ పార్టీల మధ్య ఏర్పడిన అల్పపీడనం..వాయుగుండా మారనుంది. ఇప్పటి వరకు అధికార వైసీపీలో ఇన్ ఛార్జీల మార్పులతో ఆ పార్టీలో చిన్నపాటి వ్యతిరేక పవనాలు వీచాయి. అయితే ఇటీవల టీడీపీలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఆ పార్టీలో ఏకంగా తుఫాన్ నే వస్తోంది. టీడీపీలోని అసంతృప్త నేతలు.. ఆ పార్టీ అధినేత చంద్రబాబును సైతం లెక్క చేయడం లేదు. అందుకు నిదర్శనంగా వివిధ నియోజవర్గాల ఇన్ ఛార్జీలు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇప్పటి వరకు వైఎస్సార్ సీపీ పార్టీలు జరుగుతున్న పరిణామాలను చూసి తెలుగు దేశం పార్టీ  అధినేత, ఇతర ముఖ్యనేతలు తెగ సంబర పడ్డారు. అయితే తమదాక వస్తే తెలియదు నొప్పి అన్నట్లు.. ఇప్పుడు టీడీపీ వంతు వచ్చింది. టికెట్ ఆశించి.. భంగపడుతున్న నేతలు ఒక్కొక్కరిగా వచ్చి తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొందరు టికెట్ ఎవరికి అనేది  ఖరారు చేసే వరకు వేచి చూస్తుండగా, మరికొందరు మాత్రం..బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

నూజివీడు టికెట్ ను ఆ పార్టీ ఇన్ ఛార్జీ ముద్దరబోయిన వెంకటేశ్వర రావుకు కాదని, వైసీపీ నుంచి వెళ్లిన కొలుసు పార్థసారథికి టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఇదే ఇప్పుడు  టీడీపీలో చిచ్చు పెట్టింది.  తనకు టికెట్ రాదని వస్తున్న వార్తల నేపథ్యంలోనే అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు వెంకటేశ్వరావు. ఈ మీటింగ్ లో ఆయన కన్నీంటి పర్యంతమయ్యారు. అంతేకాక పార్టీని వీడేందుకు కూడా ఆయన సిద్ధమయ్యారు. అలాగే మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన రాకను  మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకవైపు వసంతను పార్టీలోకి చేర్చుకుని టికెట్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తుంటే.. తానే అభ్యర్థినంటూ దేవినేని ఉమ మరోవైపు ప్రచారానికి కూడా సిద్ధమవుతున్నారు. అధినేత ఆదేశాలను కాదని వసంత కృష్ణపై పరోక్షంగా దేవినేని ఆరోపణలు చేస్తుడడడం గమనార్హం.

అలానే కోస్తాంధ్రాలోని వివిధ జిల్లాలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక రాయలసీమలోని తెలుగు తమ్ముళ్లు కూడా చంద్రబాబును లెక్క చేయడం లేదు. తమని కాదని మరొకరి టికెట్ ఇస్తే.. మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదన్నట్లు అక్కడి నేతల తీరు ఉంది. రాయచోటి మాజీ ఎమ్మెల్యే  రమేష్ రెడ్డికి టికెట్ ఇవ్వడంలేదని టీడీపీ చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో  మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఇస్తున్నట్లు సమచారం. దీంతో రాయచోటి టీడీపీ ఇన్ ఛార్జీగా ఉన్న రమేష్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇలానే ఉమ్మడి అనంతపురం జిల్లాలో  పరిటాల, జేసీ కుటుంబాలు సైతం చంద్రబాబుపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. జేసీ కుటుంబం తాడిపత్రి ఎమ్మెల్యే, అనంతపురం ఎంపీ సీటును ఆశిస్తుండగా..దానికి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేయలేదంట. దీంతో జేసీ కుటుంబం చంద్రబాబుపై ఆగ్రహం ఉన్నారని తెలుస్తోంది.

అలానే పరిటాల ఫ్యామిలీ కూడ ధర్మవరం సీటును ఆశించగా, రాప్తాడుకే పరిమితం కావాలని చంద్రబాబు సూచినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ అధినేతపై పరిటాల కుటుంబం కూడా మండిపడుతోందని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజవర్గాల్లో టీడీపీ పరిస్థితి ఇలానే ఉంది. ఇంకా అధికారికంగా టీడీపీ టికెట్లు ప్రకటించకుండానే ఆ పార్టీలో ప్రకంపనాలు చెలరేగుతున్నాయి. పొత్తుల్లో భాగంగా టికెట్లు దక్కకపోతే..టీడీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో, తాజాగా ఉదంతాలు నిదర్శనం. ప్రస్తుతం చంద్రబాబును ఎవరూ ఖాతరు చేసే పరిస్థితి లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి.. ప్రస్తుతం టీడీపీ కనిపిస్తున్న అసంతృప్త సెగలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి