iDreamPost

రామ్ చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘గేమ్ ఛేంజర్’ క్రేజీ అప్ డేట్..!

  • Published Feb 19, 2024 | 6:47 PMUpdated Feb 19, 2024 | 6:47 PM

ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "గేమ్ ఛేంజర్". అయితే, ఈ చిత్రాన్ని ఈ ఏడాది విడుదల చేస్తామని వస్తున్న వార్తలే కానీ.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎటువంటి అప్ డేట్ రాలేదు. దీనితో అభిమానులకు ఈ సినిమా అసలు ఈ ఏడాది రిలీజ్ అవుతుందా లేదా అనే కొత్త సందేహాలు మొదలయ్యాయి.

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో “గేమ్ ఛేంజర్” మూవీ తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎటువంటి అప్ డేట్స్ రాలేదు. రిలీజ్ డేట్ గురించి కూడా అప్పుడు ఇప్పుడు అని టాక్స్ ఏ కానీ, మేకర్స్ నుంచి మాత్రం ఎటువంటి క్లారిటీ లేదు. మరో వైపు షూటింగ్ కూడా ఇంకా పూర్తి కాలేదు. దీనితో అభిమానులకు కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. అసలు ఈ సినిమాను అనుకున్న టైమ్ కి విడుదల చేస్తారా లేదా అని. ఈ క్రమంలో తాజాగా వారందరికీ ఓ గుడ్ న్యూస్ ను తెలియజేశారు మేకర్స్. తాజాగా వచ్చిన అప్ డేట్స్ గురించి విషయాలు ఇలా ఉన్నాయి.

రామ్ చరణ్ , కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా.. శంకర్ దర్శకత్వంలో “గేమ్ ఛేంజర్” రాబోతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే, ఈ చిత్రం షూటింగ్ దాదాపు 90% పూర్తయిందని .. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు మేకర్స్. ఇక తాజాగా వచ్చిన అప్ డేట్ ప్రకారం .. ‘గేమ్ ఛేంజర్’ 10 రోజుల షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలుకానుందట. ఈ చిత్రం షూటింగ్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. కాగా, ఈ మూవీలో అంజలి, శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, నవీన్ చంద్ర లాంటి నటీ నటులు కనిపించనున్నారట. ఈ సినిమా గురించి మరిన్ని అప్ డేట్స్ పై .. మేకర్స్ నుంచి పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

అలాగే, ఈ చిత్రం ఆలస్యం అవ్వడానికి కారణం ఏంటి అనే ప్రశ్నకు.. కూడా దిల్ రాజు సమాధానం ఇచ్చారు. రాజ‌మౌళి, శంక‌ర్, సుకుమార్‌ లాంటి దర్శకులకు .. పెద్ద పెద్ద ప్లాన్స్ ఉంటాయని. వారి సినిమాలు ఆలస్యం అయినా కూడా రిసల్ట్ అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉందని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి, ఈ సినిమా విడుదల తర్వాత ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి, రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” మూవీపై వచ్చిన ఈ లేటెస్ట్ అప్ డేట్ పై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి