iDreamPost

Kalki 2898 AD: కల్కి ప్రభాస్‌ ఎంట్రీ సీన్స్‌పై.. సంగీత దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు

  • Published Feb 08, 2024 | 12:35 PMUpdated Feb 08, 2024 | 12:35 PM

ఇప్పుడు అందరి చూపు ప్రభాస్ రాబోయే చిత్రం అయినా "కల్కి" మీదే ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ తో భారీ హైప్ క్రియేట్ అవుతున్న సమయంలో.. తాజాగా కల్కి నుంచి మరో అప్ డేట్ వచ్చింది.

ఇప్పుడు అందరి చూపు ప్రభాస్ రాబోయే చిత్రం అయినా "కల్కి" మీదే ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ తో భారీ హైప్ క్రియేట్ అవుతున్న సమయంలో.. తాజాగా కల్కి నుంచి మరో అప్ డేట్ వచ్చింది.

  • Published Feb 08, 2024 | 12:35 PMUpdated Feb 08, 2024 | 12:35 PM
Kalki 2898 AD: కల్కి ప్రభాస్‌ ఎంట్రీ సీన్స్‌పై..  సంగీత దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు

గత ఏడాది ఆఖరిలో డార్లింగ్ ప్రభాస్ సినిమా “సలార్” చేసిన సందడి అంత ఇంత కాదు. థియేటర్ లో అందరికి పూనకాలు తెప్పించేశాయి ప్రభాస్ లుక్స్. గత కొంతకాలంగా సినిమాల విషయంలో కాస్త నిరాశ చూస్తున్న క్రమంలో.. సలార్ పార్ట్-1 సీజ్ ఫైర్ లో ఆ నిరాశలన్నీ కరిగిపోయి.. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లను కొల్లగొట్టింది ఈ చిత్రం. ఇక ఆ భారీగా క్రియేట్ అయిన హైప్ ను ఎక్కడ తగ్గనివ్వకుండా.. ఒక దాని తర్వాత ఒకటి డార్లింగ్ సినిమా అప్ డేట్స్ ను రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో విడుదలకు సిద్ధంగా ఉన్న ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ “కల్కి 2829 AD” . ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ తో ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. అది కూడా ప్రభాస్ ఎంట్రీ సీన్ కు సంబంధించింది. దీనితో కల్కి చిత్రంపై ఇంకాస్త ఆసక్తి పెరుగుతూ వస్తుంది. ఆ అప్ డేట్ ఏంటో తెలుసుకుందాం.

‘కల్కి 2898 AD’ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్.. లాంటి భారీ తారాగణం కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో రిలీజ్ చేయనున్నట్లు .. ఆల్రెడీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ పనులు వేగాన్ని పుంజుకున్నాయి. మరోవైపు కల్కి ప్రాజెక్ట్ గురించి నిత్యం.. సోషల్ మీడియాలో ఆసక్తిరక విషయాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ మ్యూజిక్ డైరెక్టర్.. ప్రభాస్ ఎంట్రీ సీన్ గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు.

Music director's interesting comments on Kalki Prabhas' entry scene

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ సినిమాకు.. తాను భారీ లెవల్ మ్యూజిక్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఆ విషయమై కొన్ని విషయాలు ఇలా చెప్పుకొచ్చారు. “నేను ప్రభాస్ సర్ కోసం సంగీతాన్ని ఇప్పటికే కంపోజ్ చేశాను. కానీ మళ్లీ మళ్లీ దానిపైనే వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రభాస్ మాస్ అప్పీల్ ను ప్రేక్షకులకు చుపించాలనుకుంటున్నాను. ప్రభాస్ ఫినామినేషన్ కాబట్టి.. ఆయన కోసం చాలా స్పెషల్ గా మ్యూజిక్ క్రియేట్ చేస్తున్నాను. ఆయన ఎంట్రీ సీన్ పెద్దదిగా.. భారీగా ఉంటుంది.. కాబట్టి అదే స్థాయిలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. దీనితో ఈ సినిమాపై ఇంకాస్త హైప్ క్రియేట్ అయింది.

అంతే కాకుండా ప్రభాస్ మీద ఆయనుకున్న ఇష్టాన్ని వ్యక్తపరుస్తూ ఈ విధంగా చెప్పుకొచ్చారు. .”ప్రభాస్ అంటే చాలా స్పెషల్. అందుకే ఈ మూవీలో ఆయన ఇంట్రో సీన్ కోసం చాలా స్పెషల్ గా మ్యూజిక్ క్రియేట్ చేస్తున్నాను. ఇంట్రో వర్క్ పెద్దగా, మాస్ గా ఉండాలి” అని చెప్పుకొచ్చారు. ఇక ఈ ‘కల్కి 2898 AD’ చిత్రానికి దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. ఇక కల్కి తో పాటు రాజాసాబ్, సలార్ పార్ట్ 2, స్పిరిట్ చిత్రాలు .. ప్రభాస్ కు క్యూలో ఉన్నాయి. చూడబోతుంటే వరుస చిత్రాలతో ప్రభాస్ ఫ్యాన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ అందించేలా ఉన్నాడు. మరి, తాజాగా ‘కల్కి 2898 AD’ మూవీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి