iDreamPost

తరతరాల భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతున్న జగన్‌

తరతరాల భూ వివాదాలకు  శాశ్వత పరిష్కారం చూపుతున్న జగన్‌

భూమి ఉంటుంది కానీ హక్కులుండవు. పోలం సాగుచేసుకుంటారు కానీ పట్టాలు ఉండవు. పట్టాలు ఉంటే పొలం విస్తీర్ణం ఎంతో తెలియదు. బంధువుల మధ్య తగాదాలు, పక్క పొలం వారితో సరిహద్దు వివాదాలు, అన్నదమ్ముల మధ్య పంపకాల్లో సమస్యలు.. ఇలా లెక్కలేనన్ని భూ సమస్యలతో గ్రామీణ భారతంలో నిత్యం అశాంతి నెలకొంది. బ్రిటీష్‌ కాలం నాటి భూ సర్వే గణాంకాలు, రికార్డులే నేటికి దిక్కు అంటే స్వాతంత్య్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందన్న ప్రశ్న వెంటనే వేసుకుంటాం. ఎన్ని దశాబాద్ధాలు గడిచినా, తరాలు మారినా భూ సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. తరతరాలుగా నెలకొన్న సమస్యలను పరిష్కరించి, గ్రామీణ భారతంలో శాంతి, సాగుచేసుకుంటున్న భూములపై హక్కులు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నడుం బిగించింది.

రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూ సర్వే చేయాలని ఇప్పటికే నిర్ణయించిన జగన్‌ సర్కార్‌ అందు కోసం అవసరమైన ఆదేశాలు జారీ చేసింది. జగన్‌ ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఇది కూడా ఒకటి కావడం, అదీ మొదటి ఏడాదిలోనే పరిష్కారం కోసం అడుగులు పడడం జగన్‌ చిత్తశుద్ధికి నిదర్శనం.

కంటిన్యూస్‌ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ స్టేషన్‌ (కార్స్‌) అనే సాంకేతిక పరిజ్ఞానంతో భూముల రీ సర్వే చేయనున్నారు. ప్రతి ల్యాండ్‌ బిట్‌కు ఆధార్‌ మాదిరిగా భూధార్‌ అనే విశిష్ట నంబర్‌ను కేటాయించనున్నారు. ఫలితంగా భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తకుండా.. పంటలు, ఇన్సూరెన్స్‌ తదితర సేవలకు ఈ నంబర్‌ ఉపయోగపడేలా పకడ్బందీ విధానంతో రీ సర్వేకు జగన్‌ సర్కార్‌ సిద్ధమవుతోంది. ఇప్పటికే కృష్ణా జిల్లా జగ్గయపేట మండలాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రభుత్వం.. అక్కడ సర్వే కోసం 200 కోట్ల రూపాయలు కేటాయించింది.

పైలెట్‌ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రెండు ఫేజ్‌లలో రీ సర్వే పూర్తి చేయనున్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో సర్వే అసిస్టెంట్‌ను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వారి సహాయంతో ఈ సర్వే పూర్తి చేయనుంది. ఇందు కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు, బేస్‌ స్టేషన్లు, సర్వే పరికరాలు కొనుగోలు చేసేందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వం చేపట్టింది.

ప్రభుత్వం చేయబోయే రీ సర్వేతో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో భూ వివాదాలు, ఇతర సమస్యలకు ఫుల్‌ స్టాఫ్‌ పడే అవకాశం ఉంది. రెండు, మూడేళ్లలో ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. రీ సర్వే పూర్తయితే ఇక గ్రామీణ ప్రజలు భూ సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. లంచాలు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. 2024 ఎన్నిలకు వెళ్లే లోపు తాను ఇచ్చిన అన్ని హమీలను అమలు చేసే లక్ష్యంతో ఉన్న సీఎం జగన్‌.. భూముల రీ సర్వే కూడా పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నారు. రీ సర్వే చేసి అందరికీ నూతన పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తే.. గ్రామీణ ప్రజలు జగన్‌ను తమ గుండెల్లో పెట్టుకుంటారనడంలో సందేహం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి