iDreamPost

పారిశుద్ధ్య కార్మికులతో న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్న KTR

ఇటీవల తెలంగాణలో ప్రభుత్వం మారింది. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ కు స్వస్థి చెప్పి.. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీకి స్వాగతం పలికారు తెలంగాణ ప్రజలు. అయితే మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు.. కారణం..

ఇటీవల తెలంగాణలో ప్రభుత్వం మారింది. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ కు స్వస్థి చెప్పి.. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీకి స్వాగతం పలికారు తెలంగాణ ప్రజలు. అయితే మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు.. కారణం..

పారిశుద్ధ్య కార్మికులతో న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్న KTR

సుమారు 10 ఏళ్ల కేసీఆర్ పాలనకు స్వస్థి చెప్పారు తెలంగాణ ప్రజలు. రాష్ట్రం ఏర్పడ్డాక.. తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. హమీలను నేరవేర్చుకుంటూ పోతుంది. అయితే ముఖ్యమంత్రిగా కేసీఆర్ దిగిపోయారన్న బాధ కంటే.. కేటీఆర్ లాంటి పవర్ ఫుల్ లీడర్ ని కోల్పోయామని, ఐటీ శాఖ మంత్రిగా  ఆయన ప్లేసును మరొకరు భర్తీ చేయలేరని ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణ ప్రజలు. ఏ సోషల్ మీడియా సైట్స్ చూస్తే.. కేటీఆర్ గురించే ప్రస్తావన. అంతలా కేటీఆర్‌ను మిస్ అయ్యామని ఫీల్ అవ్వడానికి కారణం.. జనాలతో మమేకవ్వడమే కారణం. రాజకీయానికి అతీతంగా ఆయన స్పీచులు యూత్ ను బాగా ఆకట్టకున్నాయి. వారిలో పాజిటివిటీ, స్పిరిట్ నింపేవిధంగా మోటివేట్ చేసేవారు.

మంత్రిగా ఉన్న సమయంలోనే తన పనులతో బిజీగా ఉన్నా.. తన దృష్టికి వచ్చి సమస్యలపై స్పందించేవారు. అంత బిజీ సమయంలో కూడా సోషల్ మీడియాలో వచ్చిన సమస్యలపై కూడా చర్యలు తీసుకునేవారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న కేటీఆర్..ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ప్రతి పక్ష హోదాలో ప్రభుత్వ తప్పులను ఎండగడుతున్నారు.  ఇప్పుడు నూతన సంవత్సర వేడుకలను పారిశుద్ధ్య కార్మికులతో కలిసి జరుపుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. తెలంగాణ భవన్ అందుకు వేదికైంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పారిశుద్ధ్య కార్మికుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు కేటీఆర్. వారితో కాసేపు ముచ్చటించారు. వారితో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి పాల్గొన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భోజనం చేశారు. ఇక కేటీఆర్‌ను ప‌లువురు బీఆర్ఎస్ ప్రజాప్ర‌తినిధులు, నేత‌లు, కార్య‌క‌ర్త‌లు క‌లిసి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. మంత్రి పదవి లేకపోయినా.. తన పార్టీ అధికారంలో లేకపోయినా.. సోషల్ మీడియా ద్వారా పలు అంశాలపై ట్వీట్స్ చేస్తున్నారు కేటీఆర్. తాజాగా కూడా పార్టీ ఓడిపోవడానికి కారణాలివే  ఓ నెటిజన్ వ్యాఖ్యలతో ఏకీభవించారు కూడా. మరీ బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణమేమి అనుకుంటున్నారు.. అలాగే కేటీఆర్ లాంటి నాయకుడ్ని మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ మీలో ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి